వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులి దగ్గరికెళ్లి ఫొటోలు తీసిన మోడీ(వీడియో)

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌: ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిపోయారు. చ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల్లో పాల్గొన‌డానికి నయా రాయ్‌పూర్ వ‌చ్చిన మోడీ.. అక్క‌డి నంద‌న్ వ‌న్ జంగిల్ స‌ఫారీని సందర్శించారు.

 narendra modi takes photos of a tiger

ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఎన్‌క్లోజ‌ర్‌లో ఉన్న పులిని ఫొటోలు తీశారు. పులికి మ‌రీ ద‌గ్గ‌ర‌గా వెళ్లి ఫొటోలు తీయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం విశేషం. ఆయ‌న వెంట చ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం ర‌మ‌ణ్‌సింగ్, పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు.

కాగా, ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

ఇది ఇలా ఉండగా, ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.. ఇవాళ రాష్ట్ర ప్రజలకు పండుగరోజని, ఈ సమయంలో తాను ఇక్కడ గడపడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ ప్రజలు అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ని గుర్తు చేసుకోవాలని అన్నారు.

2000 సంవత్సరంలోనే ఆయన హయాంలో ఛత్తీస్‌గడ్‌తోపాటు ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ర్టాలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా మోడీ.. నయా రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన 15 అడుగుల ఎత్తు ఉన్న పండిత్ దీన్ దయాళ్ విగ్రహావిష్కరణ కావించారు.

English summary
Prime Minister Narendra Modi has took photos of a tiger in Nandan Van Jungle Safari in Naya Raipur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X