వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్ సర్వేలో ధిగ్గజాలను దాటేసి, అగ్రస్థానంలో నిలిచిన ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీ

టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 18 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యధిక మంది ఓటేశారు. టైమ్ మేగజైన్ నిర్వహించిన సర్వేలో ట్రంప్, ఒబామా ల కంటే మోదీ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపారని తెలిపింది. టైమ్ పత్రిక ఎడిటర్లు తమ పత్రిక తరపున పర్సన్ ఆఫ్ ది ఇయర్ ను ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఈ ఫలితాలు బుదవారం నాడు వెలువడనున్నాయి.

పెద్ద నగదు నోట్లు రద్దు ప్రభావంతో ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత క్రేజీని పెంచాయి. టైమ్ పత్రిక నిర్వహించిన ఓ సర్వేలో అత్యంత ప్రభావంతమైన నాయకుడిలో ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైపుకే ఎక్కువ మంది మొగ్గుచూపారని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. అయితే ఈ ఫలితాలను ఆ పత్రిక ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. టైమ్ పత్రిక ఎడిటర్లు ఇయర్ ఆఫ్ ది పర్సన్ ను ఇంకా నిర్ణయించాల్సి ఉంది.

Narendra Modi top place Time reader's poll for Person of the Year

పెద్ద నగదు నోట్ల రద్దుతో మోడీకి క్రేజీ

దేశంలో నల్లధనం నిర్మూలించేందుకుగాను ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకొన్న నిర్ణయంపై వివిద దేశాల్లో మోడీ ప్రతిష్టను మరింత పెంచిందని సర్వే ఫలితాలను బట్టి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టనున్న ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా కంటే ఎక్కువగా మోడీవైపే సర్వేలో ప్రజలు మొగ్గుచూపారు. ఈ సర్వేలో మోడీకి సుమారు 18 శాతం ఓట్లు వచ్చాయి. ట్రంప్ కు, ఒబామా, వ్లాదిమిర్ పుతిన్ తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఫలితాలను ఆ పత్రిక ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకొన్న పెద్ద నగదు నోట్ల ప్రభావంతో ఆయనకు మరింత క్రేజీ పెరిగిందనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.ఈ ఫలితాలను బుదవారం నాడు ఆ పత్రిక అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Narendra Modi top place Time reader's poll for Person of the Year

అమెరికాలో కూడ మోడీకి ఓట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇటీవలే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఒబామా కంటే కూడ మోడీ ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదివారం అర్థరాత్రి నాటికి సర్వే పూర్తైంది. సర్వే పూర్తయ్యే సమయానికి ఆయనకు 18 శాతం ఓట్లు వచ్చాయి.అమెరికాలో కూడ నరేంద్రమోడీకి ఓట్లు వచ్చాయని సర్వే వెల్లడిస్తోంది. ఇండియాలో సాధారణంగా మోడీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అయితే దీనికి విరుద్దంగా అమెరికాలో కూడ మోడీకి అనుకూలంగా ఓట్లు రావడం విశేషం. అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల్లో కూడ ఓట్లు వచ్చాయి.

Narendra Modi top place Time reader's poll for Person of the Year

ట్రంప్ తో సహ మిగిలిన వారికి 7 శాతం ఓట్లు

ఆదివారం నాడు సర్వే పూర్తయ్యే సమయానికి నరేంద్ర మోడీకి 18 శాతం ఓట్లు వస్తే, ట్రంప్, ఒబామా, జూలియన్ అసాంజే, లకు 7 శాతం ఓట్లు వచ్చాయి.ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకన్ బర్గ్ కు 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.అమెరికా ఎన్నికల్లో ఓటమిపాలైన హిల్లరీ క్లింటన్ కు కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తోందని తొలుత భావించినా, అనూహ్యంగా ట్రంప్ గెలిచారు.అయితే హిల్లరీకి కేవలం 4 శాతం ఓట్లు రావడం గమనార్హం.

Narendra Modi top place Time reader's poll for Person of the Year

కేటగిరీల వారీగా అవార్డులు

కేటగిరిల వారీగా టైమ్ మేగజైన్ ప్రతి ఏటా అవార్డులను ప్రకటిస్తోంది. అయితే ఈ ఏడాది అత్యంత ప్రభావంతమైన నాయకుడిగా ఇండియా ప్రధాని నరేంద్రమోడీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. మరో వైపు కళాకారులు, రాజకీయ నాయకులు, సంస్థలు, ప్రతిభావంతులైన నాయకులను ఎంపిక చేసి అవార్డులను టైమ్ మేగజైన్ ప్రకటిస్తోంది. ఈ మేరకు బుదవారం నాడు ఆ మేగజైన్ అవార్డు వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

English summary
Time magazine conducting every year year of the person award, this year india prime minister narendramodi get 17 percentage of votes in survey . time magazine editors not decide who is the year of the person,on wednesday magazine releases result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X