వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేదార్‌నాథ్‌ లో ప్రధాని మోడీ.. ఆలయ సందర్శన, పూజలు, శంకుస్థాపనలు

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం సందర్శించారు. నిన్న ఉత్తర కశ్మీర్ లోని గురేజ్ సెక్టర్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi in Kedarnath : Modi's Kedarnath development plan : Video | Oneindia Telugu

ఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం సందర్శించారు. నిన్న ఉత్తర కశ్మీర్ లోని గురేజ్ సెక్టర్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

అదే ఆయన కుటుంబం: మోడీ దీపావళి వేడుకలు.. వరుసగా నాలుగే ఏడాదీ సైనికులతోనే...అదే ఆయన కుటుంబం: మోడీ దీపావళి వేడుకలు.. వరుసగా నాలుగే ఏడాదీ సైనికులతోనే...

అనంతరం శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ జలీగ్రాంట్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడ్నించి కేదార్‌నాథ్‌ వెళ్లారు.

Narendra Modi visited Kedarnath Temple

ఈ సీజన్‌లో ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. మే 3న ఆలయ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం మరోసారి ఆలయాన్ని దర్శించుకున్నారు.

కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించిన మోడీ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 2013లో సంభవించిన జలప్రళయంలో దెబ్బతిన్న ఆదిశంకరాచార్య సమాధి పునర్‌నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చలికాలంలో కేదార్ నాథ్ కు వెళ్లే అవకాశం ఉండదు. అందుకే ఆ ఆలయాన్ని ఏటా ఆరు నెలలపాటు మూసి ఉంచుతారు. ఈ ఏడాది మేలో ఈ ఆలయ ద్వారాలు తెరిచారు. తిరిగి రేపు.. అంటే శనివారం మూసివేయనున్నారు.

English summary
After spending Diwali with Army and BSF personnel in North Kashmir’s Gurez sector on Thursday, Prime Minister Narendra Modi flew to Uttarakhand’s Kedarnath temple Friday morning before it closes ahead of the winter. The Himalayan shrine, dedicated to Shiva, closes Saturday for as long as six months. Modi had paid a visit to the temple on May 3 as well .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X