వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్మెట్‌తో ఏనుగు బంతాట, కొద్దిలో ప్రాణాలతో బతికారు (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురిలో ద్విచక్ర వాహనం పైన వేగంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఏనుగు దాడి నుంచి బతికిబయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం నాడు సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

జల్‌పాయిగురి జాతీయ రహదారి 31పైన జరిగిన ఈ ఘటనలో ఆ ఏనుగు హెల్మెట్‌తో బంతి ఆట ఆడినంత పని చేసింది. గోరుమారా అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది.

గోరుమారా అటవీ అధికారి సునీతా వెల్లడించిన వివరాల ప్రకారం... ద్విచక్ర వాహనం పైన రోడ్డుపై వేగంగా వెళుతున్న ఇద్దరికీ ఎదురుగా వచ్చిన ఏనుగును చూసి భయంతో నోటమాట రాలేదు. బైక్‌ అదుపు తప్పి కింద పడింది. వారు కిందపడ్డారు.

Video Courtesy : ABP News

ఒకరు అక్కడి నుంచి పరుగెత్తాడు. మరో వ్యక్తి తలకు ధరించిన హెల్మెట్‌ ఆ తాకిడికి కిందపడిపోయి రోడ్డు మీద పడింది. కింద పడిన ఆ వ్యక్తి చేరువలోనే ఉన్న ఏనుగును చూసి దడుసుకుని ముందుకు పరుగెత్తాడు.

పరుగెత్తుతూ ఏదో తట్టుకొని రోడ్డు మీదనే పడ్డాడు. అది సదరు ఏనుగు ముందే పడ్డాడు. ఆ తర్వాత ఎలాగో లేచి అక్కడి నుంచి పరుగెత్తి తప్పించుకున్నాడు.

అయితే, ఏనుగు దృష్టి అంతా పక్కనే ఒరిగిపోయిన బైక్‌ మీద, రోడ్డు మధ్యలో పడిన హెల్మెట్ మీదే ఉండటంతో అతడి ప్రాణాలు దక్కాయి. ఈ లోగా ఏనుగు కాలితో, తొండంతో బైక్‌ను పక్కకు తోసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న హెల్మెట్‌ వద్దకు వచ్చి దాంతో బంతి ఆట ఆడినంత పని చేసింది.

తొండంతో తోసి, కాలితో ముందుకు తన్ని, మరోవైపు తిరిగి ఇలా కొద్దిసేపు ఆ హెల్మెట్‌తో బంతిలా ఆడింది. అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు విషయాలు వెల్లడించిన అధికారిణి దానిని ప్రత్యక్షంగా చూశారట.

English summary
It was a narrow escape for two men who were attacked by an elephant in West Bengal's Jalpaiguri district after they tried to sneak past it on their motorcyle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X