వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్రమ్ ల్యాండర్ శకలాల ఆచూకీ కనిపెట్టిన నాసా: ఫోటోలు విడుదల

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrayaan 2 : ISRO's Vikram Lander Found || Oneindia Telugu

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన దేశం మొత్తం గర్వించిన ప్రయోగం చంద్రయాన్-2. అంతరిక్ష పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు చివరి నిమిషం వరకు పోరాడి అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయినా, భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిలువెత్తు నిదర్శనం చంద్రయాన్ 2. విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి సమీపంగా వెళ్లి కుప్ప కూలటంతో నిరాశ చెందిన అసలు విక్రమ్ ఆచూకీ దొరక్క బుర్రలు బద్దలు కొట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఫైనల్ గా విక్రమ్ ఆచూకీ కనిపెట్టారు నాసా శాస్త్రవేత్తలు .

విక్రమ్ ల్యాండర్ జాడ కనిపెట్టిన నాసా

ఇస్రో చంద్రయాన్-2 ... అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్ టూ లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం అతిసమీపంలోకి వెళ్లి ఆ తర్వాత దాని జాడ కనబడకుండా పోయిన విషయం తెలిసిందే. ఇక విక్రమ్ ల్యాండర్ ను మరచిపో వలసిందేనని అందరూ భావించిన సమయంలో తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపై ఉన్న విక్రమ్ జాడను కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫోటోని షేర్ చేసింది.

విక్రమ్ ల్యాండర్ శిధిలాలను గుర్తించిన భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్

విక్రమ్ ల్యాండర్ శిధిలాలను గుర్తించిన భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్

విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపించింది. ల్యాండర్ కూలిపోయినట్లు దాని శకలాలు అక్కడ అక్కడ పడ్డట్టు నాసా తెలిపింది. విక్ర‌మ్ శిథిలాల‌ను భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ గుర్తించిన‌ట్లు నాసా చెప్పింది.

లూనార్ ఆర్బిటార్ సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఫ‌స్ట్ మొజాయిక్ ఫోటోను రిలీజ్ చేసింది. కానీ ఆ ఫోటోలో విక్ర‌మ్ ఆచూకీ చిక్క‌లేదు.

 విక్రమ్ ల్యాండర్ పడిన ప్రాంతాన్ని గుర్తించిన నాసా

విక్రమ్ ల్యాండర్ పడిన ప్రాంతాన్ని గుర్తించిన నాసా

అయితే ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న శాస్త్ర‌వేత్త ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్‌ విక్ర‌మ్ కూలిన ప్రాంతాన్ని గుర్తించగలిగారు . ఆ త‌ర్వాత ఎల్ఆర్‌వో టీమ్‌తో ష‌ణ్ముగ త‌న డేటాను షేర్ చేశాడు. దీంతో నాసాకు చెందిన ఎల్ఆర్‌వో విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించింది. అక్టోబ‌ర్ 14, 15, న‌వంబ‌ర్ 11 తేదీల్లో తీసిన ఫోటోల‌ను నాసా ఇమేజ్ సీక్వెన్స్ చేసింది. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌తో బెస్ట్ పిక్సెల్ క్లారిటీ వ‌చ్చింది. దీంతో విక్ర‌మ్‌ను గుర్తించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.

 వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో విక్ర‌మ్ శిథిలాలు

వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో విక్ర‌మ్ శిథిలాలు

గ‌తిత‌ప్పిన విక్ర‌మ్ ల్యాండర్ వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో విక్ర‌మ్ శిథిలాలు క‌నిపించాయి. ఎల్ఆర్‌వో తీసిన చిత్రాల‌ను ష‌ణ్ముగ సుబ్రమణ్యం స్ట‌డీ చేశారు. ఇక తాజాగా న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌ను నాసా ఇంకా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే విక్ర‌మ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాల‌ను గుర్తించారు. ఫోటోల్లో ఆ శిథిలాల సైజు 2*2 పిక్సెల్స్‌గా ఉన్నాయి. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతానికి సంబంధించిన రెండు ఫోటోల‌ను నాసా అప్‌డేట్ చేసింది. విక్ర‌మ్ కూల‌క‌ముందు, కూలిన త‌ర్వాత .. చంద్రుడి ఉప‌రిత‌లంపై జ‌రిగిన మార్పుల‌ను ఆ ఫోటోల్లో స్పష్టంగా అర్థమయ్యేలా రెండు ఫోటోలను నాసా అప్డేట్ చేసింది.

చంద్రుడిపై చీకటి సమయం కావడంతో ఇన్నాళ్లు దానిని కని కనిపెట్టలేకపోయారు. చిందరవందరగా పడిన శకలాలు మొత్తం 24 చోట్ల పడినట్లు గుర్తించింది. షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి మొదటి శకలాన్ని గుర్తించినట్లు నాసా తెలిపింది. విక్రమ్ లాండర్ కూలిన ప్రదేశానికి మరో 750 మీటర్ల పరిధిలో శకలాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో తెలిసిపోయింది. దీంతో అక్టోబర్ 14,15,నంవంబర్ 11 చిత్రాలు తీసి దృవీకరించినట్లు తెలిపింది.

నాసా ఫోటోలను షేర్ చెయ్యటంతో దొరికిన విక్రమ్ ల్యాండర్ ఆచూకి

నాసా ఫోటోలను షేర్ చెయ్యటంతో దొరికిన విక్రమ్ ల్యాండర్ ఆచూకి

జులైలో ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ -2 ప్రయోగాన్ని చేపట్టింది. చైనా, అగ్రరాజ్యం అమెరికా, రష్యా తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్ పంపిన దేశం భారత్ కావడం విశేషం. చంద్రుడి దక్షిణ ధ్రువానికి పంపిన ఘనత కూడా భారత్ సాధించింది. చంద్రయాన్ -2 ఆర్బిటర్ పనిచేస్తుంది. కానీ విక్రమ్ ల్యాండర్ కూలిపోవడంతో అందులోని ప్రజ్ఞాన్ రోవర్ పని చేయడంలేదు. ఏదేమైనప్పటికీ అసలు జాడ దొరకలేదు అనుకున్న విక్రమ్ ల్యాండర్ ఆచూకి ఫైనల్ గా నాసా కనిపెట్టింది.

English summary
NASA's confirmation came after an Indian computer programmer and mechanical engineer named Shanmuga Subramanian contacted NASA's project after which, the American space agency confirmed the identification by comparing before and after images.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X