వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా చేతికి విక్రమ్ ల్యాండర్ కీలక సమాచారం? ల్యాండింగ్ సైట్ ఫొటోలు, డేటా: త్వరలో ఇస్రోకు!

|
Google Oneindia TeluguNews

హ్యూస్టన్: చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ కు గురైనట్టుగా భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన కీలక సమాచారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేతికి చేరింది. విక్రమ్ ల్యాండర్ దిగినట్టుగా భావిస్తోన్న ప్రదేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, డేటాను నాసా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీన్ని త్వరలోనే వారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు అందజేయనున్నారు. విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు, ఇతర డేటా తమకు అందినట్లు నాసా అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం దాన్ని తాము విశ్లేషిస్తున్నామని అన్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా..ఇస్రో శాస్త్రవేత్తలు జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలియరాకుండా పోయిన విషయం తెలిసిందే.

తీహార్ జైలులోనే చిదంబరం: వచ్చేనెల 3 వరకూ కస్టడీ పొడిగింపు: బెయిల్ కు నో!తీహార్ జైలులోనే చిదంబరం: వచ్చేనెల 3 వరకూ కస్టడీ పొడిగింపు: బెయిల్ కు నో!

ఈ నెల 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవం వైపు ప్రయాణం సాగించిన ల్యాండర్.. ఉపరితలంపై దిగడానికి కొన్ని క్షణాల ముందు అదృశ్యమైంది. చంద్రుడి ఉపరితలం మీది నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండర్ తో ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచీ శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై దిగిందని, సాఫ్ట్ ల్యాండింగ్ కు బదులుగా హార్డ్ ల్యాండ్ అయిందని, అందువల్లే గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయినట్లు తాము ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించారు. అప్పటి నుంచి ల్యాండర్ తో అనుసంధానం కావడానికి నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అవి ఫలించట్లేదు.

 NASA Reviews Images Of Chandrayaan-2 Landing Site: Report

దీనితో నాసా రంగంలోకి దిగింది. ఇస్రోతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన శబ్ద తరంగాలను నాసా చంద్రుడిపైకి పంపించింది. అయినప్పటికీ.. విక్రమ్ ల్యాండర్ జాడ తెలియ రాలేదు. దీనితో నిరాశ చెందని నాసా.. ఈ సారి తాను ప్రయోగించిన లూనార్ రిపైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)పై ఆధార పడింది. విక్రమ్ ల్యాండర్ దిగినట్లుగా అనుమానిస్తోన్న ప్రదేశం మీదుగా ప్రయాణం సాగించేలా లూనార్ ఆర్బిటర్ కు దిశా నిర్దేశం చేసింది. రెండు రోజుల కిందటే దక్షిణ ధృవం వైపు ప్రయాణించిన లూనార్ ఆర్బిటర్.. ల్యాండర్ దిగిన ప్రదేశంపై కొన్ని ఫొటోలును తీసింది. హై రిజల్యూషన్ తో ఫొటోలు తీసినప్పటికీ.. దక్షిణ ధృవంలో అలముకున్న అంధకారం కారణంగా.. ఆశించిన స్థాయిలో ఆ ఫొటోల్లో స్పష్టత లేదని తేలింది.

అయినప్పటికీ. ఇదివరకే తాము ప్రయోగించిన శబ్ద తరంగాలతో పాటు తాజాగా లూనార్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు, దీనికి సంబంధించిన మరికొంత కీలకమైన డేటాను ప్రస్తుతం తాము విశ్లేషిస్తున్నామని ఎల్ఆర్ఓ స్పేస్ క్రాఫ్ట్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ తెలిపారు. త్వరలోనే వాటిని తాము ఇస్రోకు అందజేస్తామని అన్నారు. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి చెందిన ఫొటోలను లూనార్ ఆర్బిటర్ తీసిన విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఇస్రో నుంచి తెప్పించుకున్న కొంత సమాచారాన్ని, డేటాను పోల్చి చూస్తున్నామని, ఇదివరకు లూనార్ ఆర్బిటర్ పంపించిన కొన్ని ఫొటోలను కూడా బేరీజు వేసుకుంటున్నామని అన్నారు. చంద్రుడిపై సాయంత్ర సమయంలో లూనార్ ఆర్బిటర్ ప్రయాణించడం వల్ల మొదటిసారిగా తీసిన ఫొటోల్లో స్పష్టత లోపించిందని అన్నారు.

English summary
NASA's Lunar Reconnaissance Orbiter (LRO) spacecraft has snapped a series of images during its flyby on September 17 of Vikram's attempted landing sight near the Moon's uncharted south pole. The LRO's deputy project scientist John Keller shared a NASA statement confirming that the orbiter's camera captured the images. The LROC team will analyse these new images and compare them to previous images to see if the lander is visible (it may be in shadow or outside the imaged area)," Mr Keller was quoted as saying in the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X