వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్ 5 రోజుల షట్ డౌన్... 40 మంది సిబ్బందికి కరోనా సోకడంతో...

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కరెన్సీ నోట్ ప్రెస్‌(CNP),ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌(ISP)ను ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిల్లో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా బారినపడ్డవారిలో కొంతమంది అధికారులతో పాటు టెక్నికల్ మెయింటెనెన్స్ టీమ్ కూడా ఉన్నారు. ఈ రెండు యూనిట్లలో కలిపి ఇప్పటివరకూ మొత్తం 125 మంది కరోనా బారినపడినట్లు సమాచారం.

తాజా నిర్ణయంతో ఆదివారం(అగస్టు 30) నుంచి గురువారం(సెప్టెంబర్ 3) వరకు కరెన్సీ నోట్ ప్రెస్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దీంతో దాదాపు 68 మిలియన్ల నోట్ల ముద్రణలు నిలిచిపోనున్నాయి.
గురువారం తర్వాత ఈ రెండు ప్రెస్‌లలోని ఉద్యోగులందరికీ యాంటీజెన్ కరోనా పరీక్షలు చేస్తామని నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది.

 Nashik Currency Note Press shut for 5 days after 40 staffers test coronavirus positive

Recommended Video

Final-Year Exams To Be Held, Can't Promote Students Without It - Supreme Court || Oneindia Telugu

కాగా,అంతకుముందు కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లోనూ మూడుసార్లు కరెన్సీ నోట్ ప్రెస్ మూతపడింది. దేశంలోని 4 ప్రభుత్వ కరెన్సీ ముద్రణ కేంద్రాల్లో నాసిక్ కూడా ఒకటి. హైక్వాలిటీ బ్యాంకు నోట్లను ఇక్కడ ముద్రిస్తారు. భారత్‌లో చలామణిలో ఉన్న కరెన్సీలో దాదాపు 40శాతం నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌తో పాటు దాని దేవాస్‌లోని దాని అనుబంధ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ముద్రించబడినవే కావడం విశేషం. కరెన్సీ నోట్ ప్రెస్‌లో 2300 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా... ఐఎస్‌పీలో 1700 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.

English summary
The Currency Note Press (CNP) in Maharashtra's Nashik has been shut for five days as 40 of its staffers have tested positive for coronavirus. It has suspended operations till Thursday as about 2 per cent of its staffers have tested positive for the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X