వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: టెక్కీలకు 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు, ఐటీ గ్రోత్ 11%

దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ శుభవార్తను ప్రకటించింది. ఫిబ్రవరిలో గైడెన్స్ ప్రకటించడాన్ని వాయిదావేసిన నాస్కామ్ గురువారం నాడు2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవిన్యూ గైడెన్స్ ను ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ శుభవార్తను ప్రకటించింది. ఫిబ్రవరిలో గైడెన్స్ ప్రకటించడాన్ని వాయిదావేసిన నాస్కామ్ గురువారం నాడు2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవిన్యూ గైడెన్స్ ను ప్రకటించింది.

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ తిరోగమన దిశలో ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తాజాగా నాస్కామ్ చేసిన ప్రకటన టెక్కీల్లో ఉత్తేజాన్ని నింపుతోంది.

<strong>టెక్కీలకు శుభవార్త: ఇన్పోసిస్ లో ఉద్యోగాల కోత లేదు, కొత్తగా 20 వేల మందికి జాబ్స్</strong>టెక్కీలకు శుభవార్త: ఇన్పోసిస్ లో ఉద్యోగాల కోత లేదు, కొత్తగా 20 వేల మందికి జాబ్స్

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాద్యతలను స్వీకరించిన తర్వాత భారత సాఫ్ట్ వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హెచ్ 1 బీ వీసాలపై నిబంధలను కఠినతరం చేశారు. అంతేకాదు ఈ విషయమై ఈ నెల 26వ, తేదిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం సందర్భంగా చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

1.5 లక్షల కొత్త ఉద్యోగాలు

1.5 లక్షల కొత్త ఉద్యోగాలు

2018 ఆర్థిక సంవత్సరంలో ఐటీ గ్రోత్ గైడెన్స్ ఆశాజనకంగా ఉంటుందని నాస్కామ్ ప్రకటించింది.దేశీయంగా ఐటీ సర్వీసులు, రెవిన్యూ వృద్ది 10-11 శాతం పెరిగే అవకాశాలున్నాయని నాస్కామ్ అంచనావేసింది. అదేవిధంగా ఎగుమతుల రెవిన్యూలు గ్రోత్ 7 -8 శాతం పెరుగుతోందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 1.3 లక్షల నుండి 1.5 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనుంది నాస్కామ్ అభిప్రాయపడింది.

లాభాల్లో ఐటీ కంపెనీలు

లాభాల్లో ఐటీ కంపెనీలు

దేశీయ ఐటీ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. 2.35 శాతం ఎగిసిన ఇన్పోసిస్ కంపెనీ షేర్లు ప్రస్తుతం 1.35 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, టీసీఎస్, హెచ్ సి ఎల్ లు కూడ లాభాల్లో కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు ప్రకటించారు. 2017 లో ఐటీ ఇండస్ట్రీ ఆదాయం 11 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్టు కూడ పేర్కొంది.

అకాడమిక్ భాగస్వామ్యంపై ఫోకస్

అకాడమిక్ భాగస్వామ్యంపై ఫోకస్

ఈ ఏడాది రీ స్కిలింగ్, అకాడమిక్ భాగస్వామ్యంపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్టు నాస్కామ్ ప్రకటించింది. ఎస్ఏఏఎస్ అప్లికేషన్స్, క్లోడ్ ఫ్లాట్ ఫామ్స్, బీఐలు, గ్లోబల్ గ్రోత్ ఏరియాలుగా నాస్కామ్ గుర్తించింది. తాజాగా నాస్కామ్ ప్రకటించిన ఫలితాలు దేశీయ ఐటీ పరిశ్రమను మంచి ఊపును ఇచ్చాయి.

ట్రంప్, మోడీ భేటీతో సమస్య తీరేనా?

ట్రంప్, మోడీ భేటీతో సమస్య తీరేనా?

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత భారత ప్రధానమంత్రి మోడీ ఈ నెల 26వ, తేదిన ట్రంప్ తో సమావేశం కానున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన విధానాలు భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ తో మోడీ బేటీ తో బేటీ సందర్భంగా ఈ విషయమై చర్చించే అవకాశాలున్నట్టు అధికారవర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. వీసాల నిర్ణయంతో పాటు ఇతర నిర్ణయాలు కొంత భారత సాఫ్ట్ వేర్ రంగంపై ప్రభావం చూపిన నేపథ్యంలో వీరిద్దరి సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొంది.

English summary
Nasscom expects software export growth to slow to 7-8 percent in the current financial year from 8.6 percent a year earlier, it said on Thursday. Nasscom had,for the first time in 25 years, deferred the annual growth revenue guidance range in February, citing political and macroeconomic factors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X