వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ లకు హెచ్ 1 బీ వీసాలు: లాబీయింగ్ కు రూ.2.8 కోట్లు ఖర్చు చేసిన నాస్కామ్

హెచ్ 1 బీ వీసాలో తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనలతో దేశీయ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.వీసా నిబంధనల్లో కొత్త మార్పులు వచ్చినప్పటి నుండి కంపెనీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:హెచ్ 1 బీ వీసాలో తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనలతో దేశీయ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.వీసా నిబంధనల్లో కొత్త మార్పులు వచ్చినప్పటి నుండి కంపెనీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న అనేక నిర్ణయాల పట్ల వివాదాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది.

అమెరికాలో ఉన్న స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది.ఇతర దేశాలకు చెందిన వారికి వీసా నిబంధనలను కష్టంగా మార్చేసింది.

అయితే వీసా నిబంధనల్లో మార్పులు తెచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అయితే ఈ విషయంలో ట్రంప్ సర్కార్ ఆశించినట్టుగా స్పందించే అవకాశాలు కన్పించడం లేదు.

హెచ్ 1 బీ వీసాల కోసం రూ.2.8 కోట్లు ఖఱ్చు చేసిన నాస్కామ్

హెచ్ 1 బీ వీసాల కోసం రూ.2.8 కోట్లు ఖఱ్చు చేసిన నాస్కామ్

అమెరికన్ కాంగ్రెస్ తో లాబీయింగ్ కోసం నాస్కామ్ రూ.2.8 కోట్లను ఖర్చుచేసింది. అయితే 2013 నుండి చేస్తోన్న ఖర్చుల్లో ఇదే అధికమని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసాల నిబంధనలను కఠినతరం చ ేయడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకుగాను నాస్కామ్ లాబీయింగ్ చేసింది.

నిబంధనల సరళీకరణ కోసం నాస్కామ్ ఖర్చు

నిబంధనల సరళీకరణ కోసం నాస్కామ్ ఖర్చు

దేశీయ ఐటీ ఇంజనీర్లకు నిబంధనలు సరళీకరించేందుకు గాను నాస్కామ్ ఈ మొత్తాన్ని ఖర్చుచేస్తోందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.అమెరికాకు 45వ, అధ్యక్షుడిగా ట్రంప్ పదవిని చేపట్టిన తర్వాత హెచ్ 1 బీ వీసాలపై ఆందోళన మరింత ఎక్కువైంది.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీ మేరకు ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేశారు.

.కొత్త వీసా నిబంధనలు అమెరికన్లకే ఉపయోగం

.కొత్త వీసా నిబంధనలు అమెరికన్లకే ఉపయోగం

ట్రంప్ తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధలను అమెరికన్లకు ప్రయోజనం కల్గించనున్నాయి. హెచ్ 1 బీ వీసా ప్రోగ్రామ్ ప్రతిపాదిస్తున్న కొత్త సంస్కరణలు ఇందులో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.ఈ కొత్త ప్రతిపాదనలకు ట్రంప్ నుండి మంచి మద్దతు ఉందని సమాచారం. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వల్ల అమెరికాకే లాభమని నాస్కామ్ వాదిస్తోంది.

అమెరికాతో నాస్కామ్ లాబీయింగ్

అమెరికాతో నాస్కామ్ లాబీయింగ్

2003 నుండి నాస్కామ్ అమెరికాతో లాబీయింగ్ నిర్వహిస్తోంది. ఈ మేరకు అమెరికా లాబీయింగ్ సంస్థ హిల్ సేవలను ఆ సంస్థ వాడుకొంటోంది. అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ చర్చలు జరుపుతోంది.అయితే 2003 నుండి ఇప్పటివరకు చేసిన ఖర్చులో 2016 లో చేసిన ఖర్చే అధికరంగా నాస్కామ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అమెరికాతో చర్చిస్తుండగా, నాస్కామ్ అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ చేస్తోంది.

English summary
Indian IT companies over the past one year have been facing tough time because of factors such as tightened H1B visa norms in the US, Brexit and the rise of artificial intelligence (AI) and automation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X