• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజకీయాల్లో చిల్లర వ్యవహారాలు..! నిన్న జీవియల్..! నేడు పటేల్..! ఏం జరుగుతోంది..?

|

గుజరాత్/హైదరాబాద్ : రాజకీయాల్లో అన్ని వర్గాల ప్రజలను ఒప్పించడం ఏ రాజకీయ నేతకు సాద్యం కాదు. అలాగే అన్ని వర్గాలకు నచ్చే విధంగా ప్రసంగాన్ని కూడా అసాద్యమే. ఎంత పరిపక్వతగా వ్యవహరించినా, ఎంత ఉన్నతంగా ఉపన్యాసం ఇచ్చినా ఎక్కడో, ఏ మూలనో అసంత్రుప్తి రాజుకుంటూనే ఉంటుంది. అంతమాత్రాన ఆ రాజకీయ నాయకుడి పట్ల శత్రుత్వం పెంచుకోవడం అంత సబ్యత అనిపించుకోదు. ఐతే నచ్చని రాజకీయ నాయకుడు తారసపడితే నిశ్శబ్దంగా సైడైపోవాలి గాని ఎదురుదాడి చేయడం సమంజసం కాదు. నిన్న బీజేపి ఎంపీ జీవీయల్, నేడు గుజరాత్ లో హార్దిక్ పటేల్ మీద జరిగిన దాడి సభ్యసమాజాన్ని సుగ్గుపడేలా చేస్తోంది.

 రాజకీయ నేతలపై బౌతిక దాడులు..! పబ్లిసిటి కోసమా..! పాగల్ వ్యవహారమా..!!

రాజకీయ నేతలపై బౌతిక దాడులు..! పబ్లిసిటి కోసమా..! పాగల్ వ్యవహారమా..!!

నిన్న బీజేపీ నాయకులు మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ లోని బహిరంగ సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు హర్థిక్ పటేల్ పై అజ్ఞాత వాసి దాడిచేశాడు. ఈ ఘటన సురేందర్ నగర్ లో జరిగింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన హార్దిక్, బీజేపీ పాలనను విమర్శిస్తుండగా, ఈ ఘటన జరిగింది. ఆపై తన ప్రసంగాన్ని కాసేపు నిలిపి, తిరిగి కొనసాగించిన హార్దిక్, ఈ తరహా ఘటనలతో మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని విచ్చిన్నం చేయలేదని, వీటికి తానేమీ భయపడబోనని, రానున్న ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని అన్నారు.

 సంయమనం కోల్పోతున్న వ్యక్తులు..! సహనంతో వ్యవహరిస్తే తప్పు లేదుగా..!!

సంయమనం కోల్పోతున్న వ్యక్తులు..! సహనంతో వ్యవహరిస్తే తప్పు లేదుగా..!!

నిన్న బీజేపీ నాయకులు జీవీఎల్ పై దాడి చేసిన వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని అందుకే దాడి చేసినట్టు అతని సన్నిహితులు తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ నాయకులు హర్థిక్ పటేల్ పై దాడి చేసిన వ్యక్తి ఎందుకు ఇలా చేశాడన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలపై దాడితో సమావేశాల్లో నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

 బౌతిక దాడులు తప్పు..! శిక్షలు ఉండాల్సిందే..!!

బౌతిక దాడులు తప్పు..! శిక్షలు ఉండాల్సిందే..!!

ఇదిలా ఉండగా బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జీవీఎల్ మీడియాతో మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి ఆయనపై చెప్పును విసిరాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు, పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బయటకు లాక్కెళ్లారు.

ప్రజాస్వామ్యంలో స్వేచ్చ ఉండాల్సిందే..! శ్రుతిమించితే ప్రమాదమే..!!

ప్రజాస్వామ్యంలో స్వేచ్చ ఉండాల్సిందే..! శ్రుతిమించితే ప్రమాదమే..!!

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సిఉంది. ఎంపీపై షూ విసిరిన వ్యక్తిని డాక్టర్ శ‌క్తి భార్గవ్‌గా గుర్తించారు. అత‌ని కాన్పూర్ నివాసి. భోపాల్ నుంచి సాధ్వి ప్రగ్యాను ఎందుకు ఎన్నిక‌ల్లో నిల‌బెట్టామో తెలియ‌జేస్తున్న త‌రుణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సాధ్వి ప్రగ్యాతో కాంగ్రెస్‌కు స‌మ‌స్య ఏముంద‌ని ఎంపీ న‌ర్సింహారావు ఆ స‌మ‌యంలో ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు తమ తమ అభిప్రాయాలను చెప్తున్నప్పుడు సంయమనం పాటించాల్సిన వ్యక్తులు ఇలా ప్రవర్తించడం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

English summary
Another incident happened before yesterday's BJP leaders talking about the attack on a person. Congress leaders speaking at a public meeting in Gujarat attacked person on Hardik Patel. The incident took place in Surender Nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X