కలాం అంత్యక్రియలు, సీఎం డ్యాన్స్ లు (వీడియో)
అసోం: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం మరణించడంతో దేశ ప్రజలు విషాదంలో ఉన్నారు. కలాం పార్థీవదేహాన్ని ఖననం చేస్తున్న సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఏమి పట్టనట్లు ఆటలు ఆడుతూ పాటలు పాడిన సంఘటన వెలుగు చూసింది.
అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కలాం అంత్యక్రియల సమయంలో అనుచితంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. గురువారం ఉదయం రామేశ్వరంలో అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నాగాన్ ప్రాంతానికి వెళ్లారు.
Golaghat(29/7/15): Nation mourns #DrKalam, Assam CM Tarun Gogoi dances... https://t.co/9RjlanmSLb
— ANI (@ANI_news) July 30, 2015
గోల్ఫ్ కోర్టు మద్యలో హెలికాప్టర్ కిందకు దింపారు. గోల్ఫ్ కోర్టులో హెలికాప్టర్ ల్యాండ్ చెయ్యడమే కాకుండ అక్కడ గోల్ఫ్ ఆడారు. తరువాత సమీపంలోని భవనంలో స్నూకర్ ఆడారు. అంతటితో ఆగని తరుణ్ గొగోయ్ చుట్టు గన్ మ్యాన్ లను పెట్టుకుని స్థానిక మహిళలతో కలిసి డ్యాన్స్ లు వేశారు.
కలాం అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే తరుణ్ గొగోయ్ ఈ తతంగం చేశారు. అక్కడ ఉన్న అధికారులు సైతం తరుణ్ గొగోయ్ కి నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తరుణ్ గొగోయ్ ఈ విదంగా ప్రవర్తించడం సిగ్గు చేటు అని పలువురు మండిపడుతున్నారు.