వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ గడ్డం , జుట్టు పెంచటం వెనుక పెద్ద కథే .. రామ మందిర నిర్మాణంతో లింక్ ఉందన్న స్వామీజీ

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో గణనీయమైన మార్పులను తీసుకు వచ్చింది. కరోనా మహమ్మారి సమయంలో గుర్తించదగిన మార్పులలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పూర్తిస్థాయిలో తన జుట్టును, గడ్డాన్ని పెంచడం అందరిలో ఆసక్తిని కలిగించింది. అంతేకాదు గత కొన్ని నెలలుగా రకరకాల ప్రచారాలకు కారణమైంది.

భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ .. రవాణా రంగంలో స్మార్ట్ శకానికి శ్రీకారం భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ .. రవాణా రంగంలో స్మార్ట్ శకానికి శ్రీకారం

 జుట్టు, గడ్డం పెంచిన మోడీ.. బాబర్, హ్యారీ పాటర్ సిరీస్ నుండి ఆల్బస్ డంబుల్డోర్ తో పోలిక

జుట్టు, గడ్డం పెంచిన మోడీ.. బాబర్, హ్యారీ పాటర్ సిరీస్ నుండి ఆల్బస్ డంబుల్డోర్ తో పోలిక

మార్చిలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడానికి మోడీ దేశ ప్రజలకు సందేశం ఇవ్వటానికి టెలివిజన్లో కనిపించినప్పుడు సాధారణంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ , ఆ తరువాత ప్రజలు ఎప్పుడు చూసినా జుట్టు, గడ్డం పెంచి కనిపిస్తున్నారు. మోడీ జుట్టు, గడ్డం పెంచిన క్రొత్త రూపాన్ని బాబర్, హ్యారీ పాటర్ సిరీస్ నుండి ఆల్బస్ డంబుల్డోర్ మరియు ఎర్టుగ్రుల్‌తో కొందరు నెటిజన్లు పోల్చారు. మరికొందరు దీని వెనుక ‘రాజకీయ సందేశం' ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

 సామాజిక దూర నిబంధనలా ? కరోనా సంక్షోభం వల్ల ఇలానా

సామాజిక దూర నిబంధనలా ? కరోనా సంక్షోభం వల్ల ఇలానా

కొంతమంది మోడీ జుట్టు మరియు గడ్డం పెంచడం సామాజిక దూర నిబంధనల వల్ల కావచ్చు అని భావిస్తే మరికొందరు కరోనా సమయంలో మోడీ గడ్డం పెంచడం మహమ్మారి యొక్క పోరాటం , సవాళ్లను సూచిస్తుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం ముగిసినప్పుడు గడ్డం , జుట్టు కూడాతొలగిస్తారు అనే భావన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ గడ్డం పెంచిన వెనుక ఢిల్లీ లో కూడా అనేక రకాల ప్రచారాలు జరిగాయి. కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి జీవనశైలిలో గణనీయమైన మార్పులు వచ్చినట్లే ప్రధాని నరేంద్ర మోడీ లో కూడా మార్పు వచ్చిందని అందుకే ఆయన గడ్డం, జుట్టు పెంచుతున్నారని కామెంట్ చేశారు.

మోడీ గడ్డం , జుట్టు పెంచటంపై ఉడిపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వ ప్రసన్న తీర్థ కొత్త విషయం వెల్లడి

దాదాపు పది నెలల కాలంలో ఆయన గడ్డం జుట్టు కత్తిరించకపోవడానికి గల కారణాలను నెటిజన్లు తమదైన శైలిలో విశ్లేషించే పనిలో పడ్డారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ జుట్టు గడ్డం పెంచడం వెనుక రామ మందిర నిర్మాణ కార్యక్రమం ఉందని ఉడిపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వ ప్రసన్న తీర్థ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేశారని పూర్తి చేసే బాధ్యతను కలిగి ఉన్నారని చెప్పిన ఆయన మోడీ గడ్డం , జుట్టు పెంచటం వెనుక బలమైన కారణం ఉందని చెప్పారు.

రామమందిర నిర్మాణం కోసమే మోడీ జుట్టు, గడ్డం పెంచుతున్నారా ?

రామమందిర నిర్మాణం కోసమే మోడీ జుట్టు, గడ్డం పెంచుతున్నారా ?


రామమందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలను తొలగించరని, ప్రధాని నరేంద్ర మోడీ జుట్టు , గడ్డం తొలగించకపోవటానికి ఇదే కారణం కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. స్వామి విశ్వ ప్రసన్న తీర్థ చేసిన వ్యాఖ్యలతో మోడీ గడ్డం, జుట్టు తొలగించక పోవడం వెనుక పెద్ద కథ ఉందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

రామమందిర నిర్మాణం కూడా కారణం కావచ్చన్న భావన వ్యక్తం అవుతుంది .

English summary
Over a period of almost ten months, netizens have been working in their own style to analyze the reasons why PM Modi did not cut his beard. However, Udupi Pejavara peetham, Swami Vishwa Prasanna Tirtha made interesting remarks that Prime Minister Narendra Modi had a Rama Mandir construction program behind his hair growing. He said that Prime Minister Narendra Modi was responsible for completing of the mandir , as he did the Bhumi Puja for the construction of the Ram Mandir in Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X