• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేము కోరుకుంటే.. అసలు హిందుస్థాన్ అనేదే ఉండదు: ఫరూక్ అబ్దుల్లా

|
  మేము కోరుకుంటే.. అసలు హిందుస్థాన్ అనేదే ఉండదు : ఫరూక్ అబ్దుల్లా || Oneindia Telugu

  శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఘాటు వ్యాఖ్యలు, తీవ్ర పదజాలంలో విరుచుకు పడే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మరోసారి అలాంటి కామెంట్లు చేశారు. దేశాన్ని ముక్కలు కానివ్వబోమంటూ నరేంద్రమోడీ చేసిన ప్రకటనలపై ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. దేశాన్ని విడగొట్టడానికి, కాశ్మీర్ ను తమ నుంచి వేరు చేయడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని, పాకిస్తాన్ తో మిలాఖాత్ అయ్యాయంటూ ఇటీవలే మోడీ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దేశాన్ని ముక్కలు చేయడానికి ఫరూక్ అబ్దుల్లా కంకణం కట్టుకున్నారని మోడీ ఆరోపించారు. ఫరూక్‌ అబ్దుల్లా కుటుంబ రాజకీయాలు జమ్ముకశ్మీర్‌ ప్రజల మూడు తరాల భవిష్యత్తును నాశనం చేశాయని మోడీ ఆరోపించారు. వారికి రాజకీయ విశ్రాంతినిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

  క్లైమాక్స్ లో సూపర్ స్టార్ ఎంట్రీ! సుమలత కోసం.. చివరిరోజు రోడ్ షో, బహిరంగ సభ!

  మోడీ చేసిన ఈ ప్రటకలపై ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు ఎవరూ చేయట్లేదని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించడం మోడీ వల్ల కావట్లేదని విమర్శించారు. నిజంగానే తాము దేశాన్ని విడగొట్టాలని కోరుకుంటే.. అసలు హిందూస్థాన్ అనేదే ఉండదని అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఫరూక్ పాల్గొన్నారు. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. బాలాకోట్ పై వైమానిక దాడుల పేరుతో నరేంద్రమోడీ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ ముక్కలవుతారేమో గానీ, తాము దేశాన్ని ముక్కలు కానివ్వబోమని అన్నారు.

  National Conference Chief Farooq Abdullah made controversial comments on Modi

  పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పుకొంటున్న మోడీ.. దానికి సంబంధించిన ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా బహిర్గతం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పుల్వామా దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు హతమయ్యారని, దీనిపై ఎన్నికల సభల్లో ప్రస్తావించే ధైర్యం ఉందా? అని ఆయన నరేంద్రమోడీకి సవాలు విసిరారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం అంటే బాలాకోట్ లో చెట్లపై బాంబులు విసిరినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ ఎంత సేపు బాలాకోట్ పై వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్ అంటూ కథలు చెబుతున్నారని, దానికి కారణమైన పుల్వామా దాడుల గురించి ఎందుకు ప్రస్తావించరని అన్నారు. పుల్వామా దాడుల గురించి ఎన్నికల సభల్లో ప్రసంగించే ధైర్యం మోడీకి లేదని అన్నారు. నరేంద్ర మోడీ క్రమంగా జర్మనీ నియంత హిట్లర్ ను తలపిస్తున్నారని విమర్శించారు.

  English summary
  National Conference Chief Farooq Abdullah says in his Srinagar rally that, No body wants to divide the Nation. Farooq Abdullah condemned the Comments on his Party and Family members. If, We really wants to divide the Country, then there is no Hindustan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more