వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ ఇచ్చారు: ఏడాదిలో భారత్ లో 34 వేల రేప్ లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో మహిళలపై రోజురోజుకూ లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా గత ఏడాదిలో యువతులు, మహిళలపై 34,651 అత్యాచారాలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 లక్షలకు పైగా జనాబా ఉన్న 53 మెగా సిటీల నుంచి జాతీయ నేర నమోదు బ్యూరో ఈ వివరాలు సేకరించింది. క్రైమ్ ఇన్ ఇండియా- 2015 వార్షిక నివేదికను (69వ ఎడిషన్)ను కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ విడుదల చేశారు.

ఆనివేధికలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేశంలో అత్యధిక రేప్ కేసులు మధ్యప్రదేశ్ లో నమోదు అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఢిల్లీలో ఎక్కువ అత్యాచారాలు జరిగాయనే అప్రధిష్ట మూటగట్టుకుంది.

National Crime Records Bureau (NCRB) data -2015.

ఆరేళ్ల పాప నుంచి 60 ఏళ్ల వృద్దురాలి వరకు కామాంధుల కోరల్లో చిక్కుకున్నారు. 2015లో దేశంలో మొత్తంగా 34,651 రేప్ కేసులు నమోదు అయ్యాయి. అందులో బాధితులకు తెలిసిన వారే అత్యాచారం చేసిన కేసులు 33,098 నమోదు అయ్యాయి.

నిర్భయ చట్టం తీసుకు వచ్చినా అత్యాచారాల కేసులు తగ్గలేదు. ఢిల్లీలో 2,199 రేప్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రాల వారిగా మధ్యప్రదేశ్ లో 4,391 (మొదటి), మహారాష్ట్రలో 4,144 (రెండు), రాజస్థాన్ లో 3,644 (మూడు), ఉత్తరప్రదేశ్ లో 3,025 (నాలుగు) రేప్ కేసులు నమోదు అయ్యాయి.

మహిళలపై అత్యాచారం, అత్యాచారయత్నం, అవమానపరచడం లాంటి 1.3 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళపై ఇలాంటి కేసులు 15,931 కేసులు నమోదు అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.

English summary
A total of 34,651 rape cases were reported in India in 2015. as per National Crime Records Bureau (NCRB) data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X