• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా

|

సృష్టి గోస్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. అంటూ గవర్నర్ ఎదుట రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేయనప్పటికీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంక్రమించే అన్నిరకాల అధికారాలు పొంది, అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తూ, అభివృద్ధి, శాంతిభద్రత, మహిళల రక్షణ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవును. ఒక్కరోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి రికార్డు సృష్టించింది..

తిరుపతి ఉపఎన్నిక: పవన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యం

అనంతపురం కలెక్టర్ స్ఫూర్తి..

అనంతపురం కలెక్టర్ స్ఫూర్తి..

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు' లాంటి సినిమాలతో మనందరికీ ‘ఒక రోజు సీఎం' కాన్సెప్టు సుపరిచితమైంది. అయితే, రియల్ లైఫ్ లో ‘మేక్ ఎ విష్'పేరుతో కొందరు పిల్లల కలెక్టర్, పోలీస్ లాంటి కోరికలు తీర్చాయి పలు స్వచ్ఛంద సంస్థలు. గతేడాది ఏపీలోని అనంతపురం జిల్లాలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు.. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివే విద్యార్థిని.. ఒకరోజు జిల్లా కలెక్టర్ గా, ఇంకొందరు బాలికలు ఎమ్మార్వోలుగా విధులు నిర్వహించడం, ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించడం తెలిసిందే. ఇప్పుడిలాంటి కార్యక్రమాలు దేశమంతటా విస్తరించాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం మరో అడుగు ముందుకువేసి.. ఏకంగా ముఖ్యమంత్రి పదవిలో ఒక టీనేజర్ కు అవకాశం కల్పించింది..

సీఎంగా 19 ఏళ్ల యువతి..

సీఎంగా 19 ఏళ్ల యువతి..

హరిద్వార్ కు చెందిన 19ఏళ్ల సృష్టి గోస్వామి అనే యువతి ఆదివారం నాడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా ఉన్న గైర్ సెయిన్ పట్టణం నుంచి ఆమె తన పరిపాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న వివిధ సంక్షేమ పథకాలను ఆమె సమీక్షించనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా రాష్ట్రంలో పరిస్థితిని ఆమెకు నివేదించారు. సృష్టి ఒక్కరోజు సీఎంగా వ్యవహరిస్తుండగా, ప్రస్తుతం సీఎం త్రివంద్ర సింగ్ ఆమెకు సహాయకుడిగా కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఈ ఏర్పాట్లచేసింది.

RBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనా

బాలికా దినోత్సవం సందర్భంగా..

బాలికా దినోత్సవం సందర్భంగా..

సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకొంటుండటం తెలిసిందే. ఈ సందర్భంగానే సృష్టికి ఒక్కరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించే అవకాశం లభించింది. ప్రస్తుతం డిగ్రీ(బీఎస్సీ) మూడవ సంవత్సరం చదువుతున్న సృష్టి గోస్వామి ఆదివారం సీఎంగా విధులు చేపట్టడమేకాదు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. డెహ్రాడూన్ లోని అసెంబ్లీలో బాలల అసెంబ్లీ మరికాసేపట్లో ప్రారంభంకానుంది.

అమ్మాయిలకు అవకాశం రావాలేగానీ..

అమ్మాయిలకు అవకాశం రావాలేగానీ..

దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్కరోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు లభించడంపై సృష్టి గోస్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, అవకాశమంటూ దక్కితే సత్తా చాటుకోడానికి అమ్మాయిలు వెనుకాడబోరని, తాను కూడా సీఎంగా మాటలకంటే చేతల్లోనే పని చేసి చూపిస్తానని ఆమె చెప్పారు. పరిపాలన విషయంలో యువత ఎంత సమర్థవంతంగా ఉంటుందన్న విషయాన్ని నిరూపించాలని భావిస్తున్నట్లు చెప్పారు. నిజానికి 2018 నుంచి బాల్ విధాన్ సభ సీఎంగా సృష్టి పనిచేస్తున్నా, నిజమైన సీఎంగా ఒక్కరోజు అవకాశం లభించడం ఇదే తొలిసారి. సృష్టికి దేశంలోని కీలక నేతలందరూ అభినందనలు తెలిపారు.

English summary
marking the National Girl Child Day, Haridwar teenager Srishti Goswami took charge as the chief minister of Uttarakhand for one day on Sunday. She will take part in the child assembly session in Dehradun. Goswami, a student of BSc Agriculture, lives in Daulatpur village of the district. Her father runs a small shop in the village and her mother is an Anganwadi worker. The 19-year-old had in 2018 become the Chief Minister of Uttarakhand Bal Vidhan Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X