వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండేసి కార్లు కొంటే ఏంచేస్తారు?: ఢిల్లీకి ఎన్‌జిటి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశరాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సరి-బేసి సంఖ్యల వాహనాల వాడకం విధానంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ స్పందించింది. ప్రజలు రెండేసి కార్లు కొంటే అప్పుడేం చేస్తారు? అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కాలుష్యం నివారించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ విధానం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని వ్యాఖ్యానించింది. జనవరి 1 నుంచి సరిసంఖ్య రిజిస్ట్రేషన్‌ నెంబరు గల కార్లు సరి సంఖ్య తేదీలో, బేసి సంఖ్య రిజిస్ట్రేషన్‌ నెంబరు గల కార్లు బేసి సంఖ్య తేదీల్లో ఢిల్లీ రోడ్లపైకి అనుమతిస్తామని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే.

National Green Tribunal questions Delhi govt's odd-even formula for vehicles

కాగా, ఆదివారాల్లో రెండు రకాల వాహనాలకూ అనుమతి ఉంటుంది. అంతేగాక, వినియోగదారుల కోసం ప్రజారవాణా వాహనాల సంఖ్య పెంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా డీజిల్ వాహనాలను అనుమతించొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) సూచించింది. డీజిల్ వాహనాలకు రిజిస్టేషన్లు చేయొద్దని ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం డీజిల్ వాహనాలు కొనొద్దని ఆదేశించింది.

English summary
The National Green Tribunal on Friday questioned the AAP government's odd-even formula for vehicles to check pollution in Delhi, saying it may not have the desired effect. "The odd-even formula for vehicles may make people buy two cars," the NGT said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X