వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేషనల్ హెరాల్డ్ కేసు: 'ఇందిర కోడలిని, ఎవరికీ భయపడను'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. మంగళవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, కోర్టు మరోసారి వారికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19న కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.

కేవలం నాలుగు నిమిషాల్లోనే ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఈరోజు తీర్పును వెల్లడించింది. నిధుల దుర్వినియోగం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుతో పాటు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న సోనియా, రాహుల్ గాంధీ పిటిషన్లను సోమవారం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈరోజు విచారణకు వారు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది.

సోనియా, రాహుల్ తరుపున కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సాహంగా కోర్టుకు వచ్చారు. కాగా, ఈ కేసులో తమ నేతలు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని, తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.

ఇది ఇలా ఉంటే, ఈరోజు ఉదయమే రాహుల్ గాందీ పుదుచ్చేరి పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ సోనియా గాంధీ కూడా కోర్టుకు వెళ్లలేదు. ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీని జర్నలిస్టులు పలుమార్లు ప్రశ్నించడంతో తాను ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. మరో ప్రశ్నకు సమాధానంగా 'దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని.. ఎవరికీ భయపడను' అని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు.

రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. కాగా, నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేసిన విషయం తెలిసిందే.

English summary
Sonia Gandhi and Rahul Gandhi will appear in a Delhi court on December 19, to face allegations that they illegally acquired property worth Rs. 5,000 crore belonging to the National Herald newspaper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X