వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా ఓకే.. డిల్లీకి చేరుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..

|
Google Oneindia TeluguNews

జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ కశ్మీర్‌ నుంచి నేడు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. కశ్మీర్‌లోని పరిస్థితులను సమీక్షించేందుకు ఆగస్టు 6వ తేదీన దోవల్‌ అక్కడికి వెళ్లారు. దాదాపు 10 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన దోవల్‌.. అక్కడ వివిధ వర్గాల వారితో చర్చలు జరిపారు. ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రత బలగాలకు సూచనలు చేశారు. అలాగే అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

National Security Advisor Ajit Doval arrived in Delhi on friday from Kashmir.

కశ్మీర్‌ పర్యటనలో భాగంగా దోవల్‌ షోపియన్‌ జిల్లాలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో అనంత్‌నాగ్‌లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్‌ మాటమంతి చేశారు. . స్థానిక అంశాలపై అడిగి తెలుసుకున్నారు.. అలాగే అక్కడి పరిస్థితులపై ఏరియల్‌ సర్వే కూడా చేపట్టారు. ఇక ఆయన కశ్శీరీలతో కలిసి భోజనయం చేయడంపై వివాదం చెలరేగింది. డబ్బులు ఇచ్చి ప్రజలను తీసకెళ్లారని ప్రతిపక్ష కాంగ్రస్ పార్టీనేత గులాంనబి అజాద్ ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ముఖ్యంగా కశ్మీర్‌లోని అంతర్గత పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన అజిత్ దోవల్ అటు కేంద్రానికి, ఇటు భద్రతా దళాల మధ్య సమన్వయం చేకూర్చారు.కాగా అయన ఆగస్టు 10వరకే ఢిల్లీకి చేరుకోవాలని కాని 12వ తేదిన బక్రీద్ పండగ ఉండడంతోపాటు ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్యదినోత్సం మరియు 15 భారత స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం ఆయన్ను 15 ఆగస్టు తర్వాతే ఢిల్లికి రావాలని తెలిపింది. దీంతో ఎక్కడ ఎలాంటీ తీవ్రమైన సంఘటనలు జరగకుండా పరిస్థితిని సమిక్షించిన అజిత్ దోవల్ నేడు ఢిల్లికి చేరుకున్నారు.

English summary
National Security Advisor Ajit Doval arrived in Delhi on friday from Kashmir.on august 6th he went to kashmir to review the situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X