వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో విషయంలో రంగంలోకి దిగిన అజిద్ దోవల్.. వీధుల్లో తిరుగుతూ.. స్థానికులతో లంచ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : ఇకపై కశ్మీర్‌కు ఎవరైనా వెళ్లొచ్చు. అక్కడ సెటిల్ కావొచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. స్థలాలు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా కేవలం ఆర్టికల్ 370 రద్దుతో సాధ్యమైంది. ఇదివరకు కశ్మీర్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు. అవన్నీ చీకటి రోజులు. ఇప్పుడు అలా కాదు. స్వేచ్ఛా వాయువులు అందించనున్న కొత్త కశ్మీరంగా అవతరించనుంది. భూతల స్వర్గంగా ముద్రపడ్డ సుందర అందాల కశ్మీర్‌కు ఎంచక్కా వెళ్లే మంచిరోజులు వచ్చాయి.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లు అనుక్షణం భయం గుప్పిట్లో బందీలుగా మారిన అక్కడి స్థానికులు ఇప్పుడు స్వేచ్ఛగా బతికే రోజులు వచ్చాయి. ఇన్నాళ్లు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు.. నిజం చెప్పాలంటే స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఆర్టికల్ 370 రద్దుతో అందాల కశ్మీరం అవతరించనుంది. ఆ క్రమంలో కశ్మీర్‌లో ఫ్రీడమ్ అన్నట్లుగా జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ పర్యటించారు. స్థానికులతో ముచ్చటించి వారిలో నెలకొన్న భయాందోళనలు తొలగించే ప్రయత్నం చేశారు.

National Security Advisor Ajit Doval visits kashmir had lunch with locals

<strong>కోతి పనులు చేయకురా వెధవ.. బట్టలుతికే మంకీని చూస్తే ఇకపై అలా అనరేమో (వీడియో)</strong>కోతి పనులు చేయకురా వెధవ.. బట్టలుతికే మంకీని చూస్తే ఇకపై అలా అనరేమో (వీడియో)

కశ్మీర్ పర్యటనలో అజిత్ దోవల్ యాక్టివ్‌గా కనిపించారు. అక్కడి స్థానికులతో కలివిడిగా మెలిగారు. ఆ క్రమంలో సోఫియాన్ జిల్లాలో స్థానికులతో మాట్లాడిన దోవల్ వారితో కలిసి లంచ్ కూడా చేశారు. మాట కలిపి వారితో స్నేహితుడిగా కలిసిపోయారు. అంతేకాదు సెక్యూరిటీ ఫోర్స్‌తోనూ దోవల్ మాట్లాడారు. లోకల్ పోలీసులతోనూ ముచ్చటించారు. అజిత్ దోవల్ వెంబడి కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ కూడా ఉన్నారు.

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించేలా ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో కశ్మీర్‌లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆ క్రమంలో ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదన్నట్లుగా అజిత్ దోవల్ పర్యటన దోహదపడిందని చెప్పొచ్చు.

English summary
Ajit Dowal appeared active on Kashmir tour. He met with the locals. To that end, Doval had lunch with the locals in Shopian district. Doval also spoke with the security force. He was also involved with the local police. Kashmir DGP Dilbag Singh along with Ajit Doval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X