వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్‌: మోదీ పని ఈజీ చేసిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా ‘పొడగింపు’ వినతి.. 8న ప్రధాని నిర్ణయం?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 14లక్షలకు, మరణాల సంఖ్య 74వేలకు చేరువైంది. మన దేశంలో కేసుల సంఖ్య 5వేలకు, మరణాల సంఖ్య 150కి దగ్గరగా ఉంది. ఒకటిరెండు దేశాల్లో మరణాల రేటు తగ్గడం మినహా, వైరస్ ప్రభావం తగ్గిన జాడలు ఎక్కడా లేవు. లాక్ డౌన్ ఎత్తేసిన చైనాలోనూ మళ్లీ కేసులు తిరగబెడుతున్నాయి. అగ్రరాజ్యాలే అతలాకుతలం అవుతున్నవేళ.. ఆరోగ్య రంగంలో అటుఇటుగా ఉన్న ఇండియాలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తిపెరిగింది.

కేసీఆర్ సంచలనం..

కేసీఆర్ సంచలనం..

లాక్ డౌన్ ఎత్తివేత లేదా కొనసాగింపుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మరికొంత కాలం పాటు లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), కేంబ్రిడ్జి వర్సిటీ లాంటి ప్రఖ్యాత సంస్థల అధ్యయనాలే తప్ప ఇప్పటిదాకా ప్రభుత్వాధినేతలెవరూ నేరుగా స్పందిచలేదు. దీనికి సంబంధించి మొదటిసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలనం రేపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన చెప్పారు. కేసీఆర్ కామెంట్లపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది, రాజకీయంగానూ ఆయన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే..

 కాగల కార్యం కేసీఆర్ తీర్చినట్లు..

కాగల కార్యం కేసీఆర్ తీర్చినట్లు..

జనతా కర్ఫ్యూ తర్వాతి రోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ, సడెన్ గా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించారు. ఆయనా ప్రకటన చేసిన 4 గంటల వ్యవధిలోనే లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఇంత పెద్ద నిర్ణయాన్ని హడావుడిగా ప్రకటించడమేంటని ప్రధానిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఢిల్లీ నుంచి లక్షల మంది వలస కూలీల మహానిర్గమనం చేయడంతో మోదీపై విమర్శలదాడి మరింత పెరిగింది. ఇప్పటికి కూడా లాక్ డౌన్ కొనసాగింపు ఆలోచనపై పలు పార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. పలువురు ఎకనామిస్టులు సైతం సుదీర్గకాలం లాక్ డౌన్ ను తట్టుకునే శక్తి భారత్ కు లేదని వాదిస్తున్నారు. దీంతో ప్రధాని ఉన్నతస్థాయిలో సంప్రదింపులు మొదలుపెట్టారు. మోదీ నేరుగా ప్రకటన చేయడానికి ముందు.. కాగల కార్యం కేసీఆర్ తీర్చినట్లు.. తెలంగాణ సీఎం ‘పొడగింపు' రిక్వెస్ట్ తో మిగతా పార్టీలపై ఒత్తిడి పెరిగినట్లయింది.

 నాన్ కాంగ్రెస్.. నాన్ బీజేపీ..

నాన్ కాంగ్రెస్.. నాన్ బీజేపీ..

వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో లాక్ డౌన్ కొనసాగింపునకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ విషయాన్న నేరుగా వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్ లోనూ కేవలం ‘నోయిడా' ప్రాంతం వరకే లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారేతప్ప మంత్రులెవరూ ముందుకురాలేదు. లాక్ డౌన్ పొడగించాలని ముందుగా బీజేపీ ముఖ్యమంత్రులే కోరితే.. దానిపై ప్రతిపక్ష పార్టీలు రచ్చ చేసే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ ప్రతిపాదన చేయలేని పరిస్థితి. నాన్ కాంగ్రెస్-నాన్ బీజేపీ ముఖ్యమంత్రుల్లో టీఎంసీ మమతా బెనర్జీ, బీజేడీ నవీన్ పట్నాయక్ లు అతిగా జోక్యం చేసుకునే పరిస్థితి లేకపోవచ్చు. ఈ సమయంలో ఆమ్‌ ఆద్మీ కేజ్రీవాల్, వైసీపీ జగన్ కంటే కేసీఆర్ అయితే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతారనే పేరుంది.

సీఎంల కాన్ఫరెన్స్‌లో ఏం జరిగింది?

సీఎంల కాన్ఫరెన్స్‌లో ఏం జరిగింది?

దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన చర్యలతోపాటు లాక్ డౌన్ కు సంబంధించిన అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. ఆ మీటింగ్ లో ‘లాక్ డౌన్ పొడగించాల్సిందే'నని కుండబద్దలుకొట్టినట్లు కేసీఆర్ ఒక్కరే బయటికి వెల్లడించారు. ఎకానమీపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా కఠినంగా వ్యవహరించకతప్పదని మెజార్టీ సీఎంలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఆ వెంటనే ప్రధాని మోదీ వరుసగా కాన్ఫరెన్స్ లు నిర్వహించారు.

పాక్షిక సడలింపు..

పాక్షిక సడలింపు..

కరోనా హాట్ స్పాట్స్ గా గుర్తింపు పొందిన ప్రాంతాలు మినహా, వైరస్ ప్రభావం పెద్దగా లేని ప్రాంతాల్లో.. పాక్షికంగా లాక్ డౌన్ సడలింపునకు అవకాశాల్ని పరిశీలించాలని కేంద్ర మంత్రులను ప్రధాని ఆదేశించారు. సేఫ్ అనుకున్న రంగాల్లో మళ్లీ పనులు చేసుకునేలా ఆదేశించాలన్నది కేంద్ర వ్యూహాల్లో ఒకటిని రిపోర్టులు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ నుంచి కొంత మందికి మినహాయింపులిచ్చి, ఇంకొంత మందిని నిర్బంధిస్తే మొత్తం వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. ఇదే అభిప్రాయాన్ని కేసీఆర్ కూడా వ్యక్తం చేశారు.

మిగతా పార్టీలపై ఒత్తిడి..

మిగతా పార్టీలపై ఒత్తిడి..

లాక్ డౌన్ ప్రకటన దరిమిలా ఎదురైన రాజకీయ విమర్శల నేపథ్యంలో.. దేశ భవిష్యత్తును నిర్ణయించే తదుపరి నిర్ణయాన్ని సమిష్టిగా, అందరినీ సంప్రదించిన తర్వాతే తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఇప్పటికే సీఎంలు, కేంద్ర మంత్రులతో కాన్ఫరెన్సులు నిర్వహించిన ఆయన.. ఆర్థికవేత్తలతోనూ సమాలోచనలు జరపనున్నారు. కేసీఆర్ ప్రకటన తర్వాత మిగతా పార్టీలు కూడా తప్పనిసరిగా తమ స్టాండ్ వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా అన్ని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లతో ప్రధాని భేటీ కావడానికి సరిగ్గా కొద్ది గంటల ముందు కేసీఆర్ బహిరంగ ప్రకటన చేయడం వ్యూహాత్మక ఎత్తుగడలా కనిపించకమానదు.

Recommended Video

US Seeks India Help: Trump Open Request To PM Modi | Oneindia Telugu
రేపు కీలక భేటీ..

రేపు కీలక భేటీ..


రాజకీయ ఏకాభిప్రాయ సాధనలో భాగంగా బుధవారం(ఈనెల 8న) అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో మోదీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆ భేటీలో వెల్లడయ్యే అభిప్రాయన్ని బట్టి అదే రోజు లాక్ డౌన్ పై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేవీలున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్రం నుంచి వెలువడే అధికారిక ప్రకటనే తుది నిర్ణయం అవుతుంది. అప్పటిదాకా వెల్లడయ్యే అభిప్రాయలన్నీ ఊహాగానాలకిందికే వస్తాయి.

English summary
telangana cm kcr comments has become nationwide hot topic after he requested pm modi to extend lockdown even after april 14th. as a non bjp, non congress cm, kcr made modi way easy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X