వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొబ్బరిచిప్ప ఖరీదు అంతనా, నిజమా?: ఐపీఎస్ అధికారిణి ట్వీట్, ధర తెలిస్తే షాకవుతారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాధారణంగా కొబ్బరికాయ ధర రూ.15, రూ.20 మహా అయితే రూ.30 ఉంటుదేమో. కొబ్బరికాయ కొట్టాక వచ్చే కొబ్బరి చిప్పలను దాదాపు అందరూ పడవేస్తారు. ఎవరికైనా అవసరం ఉన్నా చిప్పల ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. కానీ అలాంటి ఓ కొబ్బరి చిప్ప ధరను చెబితే నోరు వెళ్లబెడతారు. ఆ కొబ్బరి చిప్ప ఖరీదు అక్షరాలా రూ.1365.

ఇంకా చెప్పాలంటే దాని అసలు ధర రూ.3000. యాభై ఐదు శాతం (55 శాతం) ఆఫర్ మీద అది దాదాపు రూ.1400కే వస్తోంది. ఈ సహజ కొబ్బరి చిప్పను ఓ ఐపీఎస్ అధికారిణి అమెజాన్‌లో చూశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Natural Coconut Shells, amazon selling natural coconut shells for just Rs 1400

ఈ కొబ్బరిచిప్ప సైజు కూడా ఒకటిన్నర అంగుళాల ఎత్తు, నాలుగున్నర అంగుళాల వెడల్పు ఉంది. ఇందులో ఓ వంద మిల్లీ లీటర్ల నీళ్లు పడతాయి. ఇటీవలి కాలంలో కొబ్బరి చిప్పలతో చేసిన బౌల్స్‌ వాడడం ట్రెండ్‌గా మారింది. కొబ్బరి చిప్పలను పాలిష్‌ చేసి, అందమైన రంగులోకి మలుస్తున్న చిప్పలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి.

ఇవి ఒక్కొక్కటీ రూ.100లోపే ఉంటున్నాయి. మరి సాధారణ కొబ్బరి చిప్పను ఏకంగా రూ.1,365కు అమ్మడం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దానిని చూసిన ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి.. సీరియస్‍‌లీ అంటూ ఆశ్చర్యపోతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పైనా నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.

English summary
What trends on the Internet is hard to gauge, and this week it’s all mundane things that have not only given celebrities a stiff competition but also created a huge buzz online. If you thought it was only the humble egg that stole the show online, Netizens chanced upon another such item that blew their minds — coconut shell. Wondering why? Well, it’s because of the fact that is being sold online for a hefty price of Rs 3000!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X