వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షణాల్లో స్పందన: గోవా ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం, అంతా సేఫ్

|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం ఎస్‌జీ 3568కు మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ హన్స.. రన్ వే కంట్రోలర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్ వెంటనే అప్రమత్తమవడంతో ఈ ప్రమాదం తప్పింది.

ల్యాండ్ అవుతుండగా..

ల్యాండ్ అవుతుండగా..

నేవీ తెలిపిన వివరాల ప్రకారం.. స్పైస్‌జెట్ విమానం ల్యాండింగ్ కోసం గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి సందేశాలు పంపింది. రన్ వే కంట్రోలర్ రమేష్ తిగ్గా, లీడింగ్ ఎయిర్‌మెన్(ఎయిర్ హ్యాండ్లర్) ఆ విమానం సరైన రీతిలో ల్యాండింగ్ కావడం లేదని గమనించారు. ముందు భాగం కిందివైపుగా ల్యాండ్ అవుతుండటం చూశారు.

ల్యాండ్ చేయొద్దంటూ..

ల్యాండ్ చేయొద్దంటూ..


రన్ వే కంట్రోలర్ వెంటనే స్పందించి ఏటీసీ టవర్‌లో విధుల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లెఫ్ట్‌నెంట్ క్యాడర్ హర్మీత్ కౌర్‌ సమాచారం అందించారు. ఆ విమానాన్ని ఇప్పుడు ల్యాండ్ చేయవద్దని, మరోసారి ప్రయత్నం చేసి ల్యాండింగ్ చేయాలని సూచించారు.

మూడో ప్రయత్నంలో సక్సెస్..

మూడో ప్రయత్నంలో సక్సెస్..

రెండోసారి కూడా ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో మరోసారి ప్రయత్నించాలని అధికారులు సూచనలు చేశారు. దీంతో మూడోసారి విజయవంతంగా విమానం ల్యాండ్ అయ్యింది. 0805 గంటల సమయంలో ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదమే జరిగివుండేది. ఎమర్జెన్సీ, సేఫ్టీ సిబ్బంది ఆ విమానంను తమ కంట్రోల్‌కి తీసుకున్నారు.

తప్పిన పెను ప్రమాదం..

తప్పిన పెను ప్రమాదం..

నావల్ ఎయిర్ ట్రాఫిక్, సేఫ్టీ సర్వీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఆ విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. లేదంటే గోవా విమానాశ్రయంలో పెను ప్రమాదాన్ని చూడాల్సి వచ్చేదని అధికారులు పేర్కొన్నారు.

English summary
Alert Runway Controller and Air Traffic Control Officer at Naval Air Station INS Hansa averted a major accident of Spicejet Flight SG 3568 today morning, 17 Dec 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X