మోడీ హవా: షరతులతో బిజెడి రెడీ, ఫ్రెండ్ జయ కూడా
న్యూఢిల్లీ/ఒడిశా/చెన్నై: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో బిజెపితో జత కట్టేందుకు పార్టీలు క్యూ కడుతున్నాయి. గతంలో బిజెపికి దూరంగా ఉన్న పలు పార్టీలు ఒక్కటొక్కటిగా ఎన్నికలకు ముందు జతకట్టాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జత కట్టేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ (బిజెడి)లు వరుసలో ఉన్నాయి.
షరతులతో బిజెడి
ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే బిజెపికి బిజెడి స్నేహహస్తం అందించింది. కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైతే షరతులతో కూడిన మద్దతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని బిజెడి నేత ప్రవత్ త్రిపాఠీ తెలిపారు.

మొత్తం దేశవ్యాప్త అభిప్రాయం, ఒడిశా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. పోలవరం విషయంలోను తమకు స్పష్టత కావాలన్నారు. ఎన్డీయేలో కలిసే విషయమై నవీన్ పట్నాయక్ స్పందించారు. బిజెపితో చేతులు కలిపే విషయమై తాము చర్చలు జరపలేదని, ఫలితాలు వచ్చే వరకు ఆగుతామన్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సహకరించమన్నారు.
జయకు మోడీ స్నేహితుడని అన్నాడిఎంకె
నరేంద్ర మోడీకి తమ పార్టీ అధినేత్రి జయలలిత మంచి స్నేహితుడని అన్నాడిఎంకె పార్టీ నాయకులు చెబుతున్నారు. మోడీ, జయలు మంచి స్నేహితులు అని, వారి మధ్య రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. మోడీ ప్రధాని అయితే మేడం జయలలిత చేయి కలిపే అవకాశాలు లేకపోలేదని అన్నాడిఎంకే అభిప్రాయపడుతోంది. జయలలిత, మోడీ మంచి స్నేహితులని, మోడీ ప్రధాని అయితే, వారు కలసి పని చేయవచ్చని పార్టీ నేత మలైస్వామి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications