వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిటైర్డ్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్...నిరుద్యోగులకు గుడ్ న్యూస్

|
Google Oneindia TeluguNews

ఒక అడుగు బలంగా ముందుకేయాలంటే రెండడుగులు వెనక్కు వేయాలి. ఇదే అవలంబిస్తున్నారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. గత నాలుగేళ్లుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులను పలు ఉద్యోగాల్లో ఆయన నియమించారు. ఇలా దాదాపు 50వేల మందిని నియమించారు. నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు ఇవ్వాల్సింది. కానీ అలా జరగలేదు.ఇక కొన్ని నెలల్లోనే ఒడిషాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని దృష్ట్యా... నవీన్ పట్నాయక్ యూ టర్న్ తీసుకున్నారు. నియమించ బడ్డ రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి విధుల్లో నుంచి తీసేసేందుకు సిద్ధమయ్యారు. ఆ ఉద్యోగాల్లో దాదాపు 27వేల కొత్త పోస్టులను విడుదల చేసి నిరుద్యోగ యువతకు గాళం వేయనున్నారు.

ఇండియన్ నేవీలో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలఇండియన్ నేవీలో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద నోటిఫికేషన్ ఉండొచ్చని ఒడిషా ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. అతి తక్కువ స్థాయి ఉద్యోగం పీయోన్ నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగం ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వరకు ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక రచిస్తున్నారు. పియోన్‌కు రూ. 15వేలు వేతనం ఉండగా... ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు రూ.50 వేతనం ఉండనుంది. డాక్టర్లు, సబ్‌ఇన్స్‌పెక్టర్, కాన్స్‌టేబుల్స్, జూనియర్ క్లర్కులు, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, వెటిరెనరీ సర్జన్, జూనియర్ క్లర్క్, ఫైర్ ఆఫీసర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. రిటైర్డ్ ఉద్యోగస్తులను తిరిగి నియమించుకుని ఆ తర్వాత ఎన్నికల పేరుతో వారిని తొలగించడం అంటే నవీన్ పట్నాయక్ మాటతప్పుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. నవీన్ పట్నాయక్ ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి.

Naveen Patnaik on a plan to remove the retired employees and shower jobs on youth

రాష్ట్రంలో కొన్నేళ్ల నుంచి 1.57 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇన్నేళ్లు లేనిది నవీన్ పట్నాయక్ ఇప్పుడే నిద్ర లేచారా అని ప్రశ్నిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులనే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నియమించుకుంటూ పోతోందని.. ఆ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎప్పటినుంచో వేచిఉందని విపక్షాలు మండిపడ్డాయి. కేవలం ఎన్నికలు సమీపిస్తుండటంతోనే ఇలాంటి రాజకీయ నిర్ణయం నవీన్ పట్నాయక్ చేశారని విమర్శించాయి. ఇదిలా ఉంటే విధులను నిర్వహిస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుతో బాధపడాల్సిన అవసరం లేదని చెబుతోంది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. తాము అధికారికంగా రిటైర్డ్ అయినప్పటికీ వారికి ఉద్యోగం కల్పించి జీతభత్యాలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి వారు కృతజ్ఞులై ఉంటారని భావిస్తోంది.

English summary
Over the last four years, the Naveen Patnaik government in Odisha recruited over 50,000 retired government officials, blocking avenues of employment for the youth in the process. With elections due in the next few months, the government has now done a complete U-turn and has decided to ‘disengage’ these re-recruited government officials and appoint about 27,000 fresh recruits in their place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X