వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ బీజేడీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గణేశీ లాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. నవీన్ పట్నాయక్‌తో పాటు మరో 21మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు పట్నాయక్ శ్రీమందిర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Naveen Patnaik To Take Oath As Odisha Chief Minister For Fifth Term

2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ అప్రతిహతంగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో బిజూ జనతాదళ్‌ 112 సీట్లు సాధించి రాష్ట్రంలో మరోసారి తన పట్టు నిరూపించుకుంది. 23 సీట్లు గెల్చుకున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగా.. కాంగ్రెస్ 9స్థానాలకే పరిమితమైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 44.7శాతం ఓట్లు బీజేడీకి రాగా.. బీజేపీ 32.5శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు 16.12శాతం ఓట్లు దక్కాయి. నవీన్ పట్నాయక్ బిజెపూర్, హింజలీ నుంచి పోటీ చేశారు. హింజలిలో 60వేలకు పైగా, బిజెపూర్‌లో 31వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు.

English summary
The team of Naveen Patnaik, who will be sworn in as Odisha Chief Minister for a fifth consecutive term on Wednesday, is likely to be a mix of experienced and new faces, according to the BJD lawmakers who were intimated of their induction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X