వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలకు స్పెషల్ క్లాసులు, కంప్యూటర్ టీచర్ అరాచకాలు, ఎక్కువ మార్కులు వేస్తానని 15 మందికి !

|
Google Oneindia TeluguNews

ముంబై: పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, నేను చెప్పినట్లు వినాలని విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్థించిన టీచర్ కు తగిన శాస్తి జరిగింది. 15 మంది విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేసి వారికి చిత్రహింసలు పెట్టిన టీచర్ ను పోస్కో చట్టం కింద అరెస్టు చేశారు. స్పెషల్ క్లాసులకు రాకుంటే, నేను చెప్పినట్లు వినకుంటే పరీక్షల్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తానని అనేక నెలల పాటు అమ్మాయిలను శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేసిన కామాంధుడికి బెండ్ తీసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్

ప్రభుత్వ స్కూల్ అమ్మాయిలు

ప్రభుత్వ స్కూల్ అమ్మాయిలు

నవి ముంబై (ముంబై)లో మునిసిపల్ స్కూల్ (ప్రభుత్వ పాఠశాల) ఉంది. ఇదే మునిసిపల్ స్కూల్ లో లోచన్ పరులేకర్ అనే వ్యక్తి కంప్యూటర్ క్లాస్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గత మూడు నెలల నుంచి స్కూల్ లో 6, 7, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు లోచన్ పరులేకర్ కంప్యూటర్ క్లాస్ లు చెబుతున్నాడు.

రాత్రి స్పెషల్ క్లాస్ లు

రాత్రి స్పెషల్ క్లాస్ లు

గత రెండు నెలల నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మునిసిపల్ స్కూల్ లో కంప్యూటర్ స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. కంప్యూటర్ స్పెషల్ క్లాసులకు హాజరౌతున్న అమ్మాయిల మీద టీచర్ లోచన్ పరులేకర్ కన్ను పడింది. రాత్రి సమయంలో టీచర్ లోచన్ పరులేకర్ అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చెయ్యడం మొదలుపెట్టాడు.

సైలెంట్ గా ఉంటే ఎక్కువ మార్కులు వేస్తా !

సైలెంట్ గా ఉంటే ఎక్కువ మార్కులు వేస్తా !

తాను చెప్పినట్లు మీరు వింటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని అమ్మాయిలకు మాయమాటలు చెప్పిన టీచర్ లోచన్ పరులేకర్ గత మూడు నెలల నుంచి వారిని మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. కంప్యూటర్ క్లాస్ లు చెప్పే ముసుగులో అమ్మాయిల శరీరం మీద తాకరాని చోట తాకుతూ, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ శారీరకంగా వారిని చిత్రహింసలకు గురి చేశాడు.

ఒక్క అమ్మాయి ధైర్యం చేస్తే !

ఒక్క అమ్మాయి ధైర్యం చేస్తే !

కంప్యూటర్ టీచర్ లోచన్ పరులేకర్ చిత్రహింసలు తట్టుకోలేని ఓ అమ్మాయి ధైర్యంగా స్కూల్ హెడ్ మాస్టర్ కు, ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు టీచర్ లోచన్ పరులేకర్ పై మండిపడుతూ మునిసిపల్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అదే సమయంలో లైంగిక వేధింపులకు గురైన మరో 14 మంది అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్యూటర్ టీచర్ లోచన్ పరులేకర్ మీద స్కూల్ హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేశారు.

కామాంధుడికి బెండ్ తీసిన పోలీసులు

కామాంధుడికి బెండ్ తీసిన పోలీసులు

15 మంది స్కూల్ విద్యార్థినిలు ఫిర్యాదు చెయ్యడంతో కంప్యూటర్ టీచర్ లోచన్ పరులేకర్ మీద పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశామని నవి ముంబై డిప్యూటీ కమిషనర్ పంకజ్ దాహాన్ చెప్పారు. కామాంధుడు లోచన్ పరులేకర్ ను కోర్టు ముందు హాజరుపరిచామని, న్యాయమూర్తి అనుమతితో నిందితుడిని మార్చి 2వ తేదీ వరకు విచారణ చెయ్యడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కేసు విచారణలో ఉందని డిప్యూటీ కమిషనర్ పంకజ్ దహాన్ మీడియాకు చెప్పారు.

English summary
Navi Mumbai Muncipal School Computer Teacher Booked Under Pocso Act case in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X