వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్, ధోని పేర్లతో పిల్లర్‌పై డీ కోడ్‌తో ఐఎస్ రాతలు : నవీ ముంబైలో హై అలర్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై : గత కొన్నిరోజులుగా స్తబ్ధుగా ఉగ్రవాదుల కదలికలు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు పూర్తయి .. కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఐఎస్ ఉగ్రవాదుల కదలికలు ఆందోళన కలిగిస్తోన్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలోని పిల్లర్‌పై ఐఎస్ రాతలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విసృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొత్తవారి వివరాలు ఆరాతీశాకే పంపిస్తున్నారు.

ఐఎస్ రాతలు ..

ఐఎస్ రాతలు ..

నవీ ముంబైలోని కోప్టే బ్రిడ్జిపై ఐఎస్ రాతలు కనిపించాయి. దీనిపై ఐఎస్ నేత అబు బకార్ ఆల్ బగ్దాదీ ఇతరుల పేర్లు ఉన్నాయి. దీంతోపాటు హఫీజ్ సయూద్ పేరును కూడా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. స్థానికుల తెలుపడంతో పోలీసులు పిల్లర్‌ను నిశీతంగా పరిశీలించారు. వారు చెప్పింది నిజమేనని ధ్రువీకరించారు. దీనిపై మీడియా పోలీసులను ఆరాతీయగా .. పిల్లర్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేపర్లను రాశారని పేర్కొన్నారు. దీంతో ఎవరు రాశారు ? ఎందుకు రాశారనే కోణంలో విచారిస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు.

బీర్ బాటిళ్లు ..

బీర్ బాటిళ్లు ..

పిల్లర్‌పై రాతలకు సంబంధించి సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యాయని వెల్లడించారు. ఘటనాస్థలంలో బీర్ బాటిళ్లు, మగ్గులు, ఇతర వస్తువులు ఉండటంతో .. ఉగ్రవాదులు రాశారా అనే అనుమానం కలుగుతుందన్నారు. అయితే సంఘటనాస్థలంలో స్థానిక యువత ఎక్కువగా ఉంటుందని స్థానికులు తెలిపారని చెప్పారు. అక్కడ వారు మద్యం సేవిస్తారని చెప్పారని .. ఈ కోణంలో కూడా విచారిస్తున్నామని వెల్లడించారు. ఏమైనా కానీ .. రాసిందేవరో అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగుతుందుని స్పష్టంచేశారు. దీంతోపాటు సీసీటీవీ ఫుటేజీని నిశీతంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

తేలికగా తీసుకోం ..

తేలికగా తీసుకోం ..

అయితే పిల్లర్‌పై రాసిన వ్యాఖ్యలను అంతా తేలికగా తీసుకోబోమని .. సరైన భద్రతా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పిల్లర్ పై డీ కోడ్ తో రాశారని .. అందుకే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. రాజకీయ నేతలు, క్రికెటర్ల పేర్లు ఉండటంతో వారి లక్ష్యంగా కుట్రపన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఈ కేసు విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు తెలిపారు. అంతేకాదు పిల్లర్ ఉన్న ఆరన్ సమీపంలో ఓఎన్జీసీ, విద్యుత్ కేంద్రం. జేఎన్పీటీ ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆకతాయిల పనైనా .. దర్యాప్తు మాత్రం చేస్తామని .. ఉగ్రవాదుల, ఆకతాయిలో త్వరలో తేలుస్తామని స్పష్టంచేశారు.

English summary
high alert has been sounded in Navi Mumbai's Uran area after messages in praise of the Islamic State (IS) appeared on one of the pillars of a bridge here on Tuesday. The messages written on the pillar of Khopte Bridge in Navi Mumbai's Uran area of Raigad district praises soldiers fighting for the IS and mentioned names of IS leader Abu Bakr al-Baghdadi and other terrorists. One of the messages also mentions the name of Hafeez Saeed."The messages or inscription drawn below the bridge mentions names of (Arvind) Kejriwal and (MS) Dhoni and also (Abu Bakr al) Baghdadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X