వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వివాదంలో సిద్దూ.. కార్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాక్ వెళ్లేందుకు అంగీకారం

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి, క్రికెటర్ సిద్దూ మరో వివాదంలో చిక్కుకుంటారా.. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్ సిద్దూను ఆహ్వానించిన నేపథ్యంలో సిద్దూ పాకిస్తాన్ వెల్లేందుకు సిద్దమయ్యారు. కాగా ఇప్పటికే ఓ సారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లి వివాదంలో చిక్కుకున్న ఆయనకు మరోసారి ఆహ్వానం పంపడంతో దానికి సిద్దూ ఆమోదం తెలిపారు.

నవంబర్ 9న పాకిస్తాన్ భూభాగంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. కాగా నవంబర్ 8న భారత భూబాగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ ,ఇతర ప్రజాప్రతినిధులు హజరుకానున్నట్టు ప్రకటించారు.

అయితే ఇప్పటికే భారత పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతవరణం నెలకోంది. నాలుగున్నర కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ గుండా భారత్‌కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లి పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైన గురుద్వార సాహిబ్‌ను దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఎలాంటీ వీసా అవసరం లేదని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది.

Navjot Singh Sidhu accepts Pakistans invite

కాగా ఈ కారిడార్‌ పనులను పాకిస్తాన్ ,భారత ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సరం ప్రారంభించాయి. ఇక కారిడార్ సిక్కు గురువైన గురునానక్ జయంతి సంధర్భంగా ప్రారంభించనున్నారు. కాగా కార్తర్‌పూర్ వెళ్లేందుకు మొదటి సారిగా 575 మందికి అవకాశం కల్పించింది. అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు ఇతర పంజాబ్ నేతలు ఉన్నారు.

సిక్కు మత వ్యవస్థాపకుడు డేరా బాబా గురు నానక్ దేవ్. ఈయన1469 నవంబర్ 29న పంజాబ్‌లో జన్మించారు. 1539 సెప్టెంబర్ 22న ఆయన మరణించారు. అయితే ఆయన పుట్టిన, మరణించిన స్థలాలు రెండు ఇప్పుడు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి.

ఆయన జన్మస్థలం లాహోర్‌కు దగ్గర్లోని నాన్ కనా సాహిబ్‌లో ఉంది. అక్కడ ఉన్న గురుద్వారాను గురుద్వారా జనమ్ ఆస్థాన్ అని పిలుస్తారు. గురునానక్ దేవ్ చివరిరోజులను కర్తార్ పూర్‌లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు 18 ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. దీంతో దాన్ని పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు.

English summary
Punjab Minister Navjot Singh Sidhu accepted Pakistan's invite to attend the ground-breaking ceremony of a corridor to the Kartarpur Sahib.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X