వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిపదవికి రాజీనామ చేసిన సిద్దూ... ? రాహుల్‌కు లేఖ...

|
Google Oneindia TeluguNews

పంజాబ్ క్యాబినెట్ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు.కాగా ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరుమీద ఓ లేఖను విడుదల చేశారు. అయితే ఇదే లేఖను పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌కు కూడ పంపనున్నట్టు తన ట్విట్టర్‌లో పేర్కోన్నారు. అయితే రాజీనామ లేఖను గవర్నర్‌‌ను అడ్రస్ చేస్తూ పంపించాల్సిన సిద్దూ పార్టీ అధ్యక్షుడు అంటూ రాహుల్ గాంధీకి లేఖ పంపడంపై పలు అనుమానాలు రేగుతున్నాయి.

రాజీనామ లేఖను ట్విట్టర్లో..

పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మంత్రి అమరిందర్ సింగ్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈనేపథ్యంలోనే తాను మంత్రి పదవికి రాజీనామ చేస్తున్నట్టు సిద్దూ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్దు హజరుకావడంతో ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్, సిద్దూకు మధ్య అంతర్గత వార్ కొనసాగుతోంది.

 సిద్దూ మంత్రివర్గ శాఖలను తొలగింపు..

సిద్దూ మంత్రివర్గ శాఖలను తొలగింపు..

ఈనేపథ్యంలోనే ఇటివల సిద్దూకు కేటాయించిన కొన్ని శాఖలను తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. శాఖలను తొలగించడంతో పాటు విద్యుత్ శాఖను చేపట్టాల్సిందిగా ఆదేశించాడు. అయితే సిద్దూ మాత్రం ముఖ్యమంత్రి కేటాయించిన విద్యుత్ శాఖను చేపట్టకుండా కనీసం సెక్రటేరియట్‌కు కూడ వెళ్లని పరిస్థితి ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సిద్దూ వ్వవహారశైలి కారణమంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది.

రాహుల్‌కు గోడు వెళ్లబోసుకున్న సిద్దూ

రాహుల్‌కు గోడు వెళ్లబోసుకున్న సిద్దూ

ఈనేపథ్యంలోనే పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న రాహుల్ గాంధిని కలిసేందుకు సిద్ధూ ఢిల్లికి వెళ్లారు. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ వయానాఢ్‌ పర్యటనలో ఉన్నాడు. కాగా రాహుల్ తిరిగి వచ్చేవరకు ఢిల్లీలోనే ఉన్న సిద్దూ జరిగిన పరిణామాలను రాహుల్‌కు వివరించడంతోపాటు తన రాజీనామ లేఖను కూడ సమర్పించినట్టు తెలుస్తోంది.

English summary
punjab minister Navjot Singh Sidhu has resigned from the state Cabinet. Submitting his resignation letter to the former Congress President Rahul Gandhi, Sidhu posted a copy of the same on Twitter. The letter is dated June 10, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X