వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్ట్ అగ్రనేత గణపతిని చుట్టుముట్టిన పోలీసులు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Naxal chief Ganapathi cornered in Chhattisgarh
న్యూఢిల్లీ: నక్సల్స్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావును దక్షిణ చత్తీస్‌గఢ్‌లో పోలీసులు చుట్టుముట్టినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రాంతంలోని అడవుల్లో గత కొంతకాలంగా గాలింపుచర్యలు చేపడుతున్న పోలీసుల చక్రబంధంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతి చిక్కుకున్నట్టుగా తెలుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.

అంబుజ్‌మండ్ అటవీ ప్రాంతంలో గణపతిని పోలీసులు దిగ్బంధం చేశారని, ఏ విధంగానూ తప్పించుకోవడానికి వీల్లేని విధంగా అన్ని ప్రాంతాలనూ కమ్మేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ లొంగిపోతున్న నేపథ్యంలో తదుపరి వ్యూహం గురించి చర్చించేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమాచారం ఏర్పాటు చేశారని, దానికి గణపతి హాజరవుతున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున మోహరించినట్టుగా తెలుస్తోంది.

గత తొమ్మిది నెలల కాలంలో చత్తీస్‌గఢ్‌లో 200మందికి పైగా నక్సల్స్ లొంగిపోవడం వల్ల ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతంలోనే మావోయిస్టుల ఉనికికే విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ అటవీ ప్రాంతంలో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్ర నేతల్ని పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు, సిఆర్‌పిఎఫ్ దళాలు పనె్నండు బృందాలుగా ఏర్పడి సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

తమ ఆచూకీకి ఎంతమాత్రం పసిగట్టలేనంతగా జార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో నక్సల్ అగ్రనేతలు ఎప్పటికప్పుడు మకాం మారుస్తూ భద్రతా దళాలకు విస్మయానే్న కలిగిస్తున్నారు. ఈ నేపధ్యంలో గణపతిని దాదాపుగా పోలీసులు చుట్టుముట్టేశారన్న కథనాలు వెలువడటం గమనార్హం. సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా ఉన్న 65 ఏళ్ల గణపతి కోసం గత కొనే్నళ్లుగా విస్తృత గాలింపు జరుగుతోంది. ఆయనను పట్టించిన వారికి 3 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామన్న ప్రకటన కూడా వెలువడింది.

English summary

 Top Naxal commander Ganapathy has been encircled by security forces in jungles of south Chhattisgarh, reports said on Monday. 65-year-old Muppala Lakshman Rao alias Ganapathy is the general secretary of CPI (Maoist). He is one of the most wanted men in India with over Rs 3 crore riding as bounty on his head.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X