వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌లో రెచ్చిపోయిన నక్సలైట్లు.. బీజేపీ ఆఫీస్‌‌పై బాంబు దాడి...

|
Google Oneindia TeluguNews

కుంతి : మహారాష్ట్ర గడ్చిరోలి ఘటన మరువక ముందే జార్ఖండ్‌లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సరాయ్‌కేలా జిల్లాలోని కుంతి నియోజకవర్గ బీజేపీ ఆఫీసును బాంబులతో పేల్చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జార్ఖండ్‌లో ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో నక్సలైట్ల చర్య చర్చనీయాంశంగా మారింది.

గురువారం అర్థరాత్రి 12.30గం. సమయంలో నక్సలైట్లు బీజేపీ ఆఫీసుపై దాడి చేసినట్లు సమాచారం. పార్టీ ఆఫీసును పేల్చివేసేందుకు నక్సల్స్ కేన్ బాంబులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా కుంతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం కుంతి, కోడర్మా, రాంచీల్లో నిర్వహించనున్న ఎలక్షన్ ర్యాలీల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఇదే అదునుగా నక్సలైట్లు పార్టీ ఆఫీసును పేల్చివేశారు. ప్రస్తుతం కుంతి నియోజకవర్గానికి కరియా ముండా ప్రాతినిధ్యం వహిస్తుండగా. ఇక్కడ మే 6న ఐదో దశలో ఎన్నిక జరగనుంది.

గడ్చిరోలి దాడి: పోలీసులదే తప్పు: యుద్ధానికి ఖాళీ చేతులతో వెళ్లారు?: ఏపీ మాజీ డీజీపీ స్వరణ్ జిత్గడ్చిరోలి దాడి: పోలీసులదే తప్పు: యుద్ధానికి ఖాళీ చేతులతో వెళ్లారు?: ఏపీ మాజీ డీజీపీ స్వరణ్ జిత్

Naxals blew up BJP party office in Jharkhand
English summary
Ahead of Bharatiya Janata Party president Amit Shah's rally in Jharkhand on Friday, Naxals blew up the party office in Kharsawan in Saraikela district. Naxals triggered cane bombs in the BJP office around 12:30 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X