వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారిన నితీశ్ స్వరం: మోడీ పేరుతో ఓట్లడిగిన నేత.. ఒకప్పుడు విమర్శించి.. నేడు ప్రశంసల జల్లు

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ వ్యుహాలు వారు అనుసరిస్తున్నారు. పైకి జేడీయూ-బీజేపీ సఖ్యంగా ఉన్నా.. లోనా మాత్రం ప్రచ్చన్న యుద్దమే జరుగుతోంది. ఇందుకు ఇరు పార్టీల పోస్టర్లు, బ్యానర్లలో వారి పేర్లు లేకపోవడమే కారణం. అయితే బుధవారం నితీశ్ కుమార్ తనదైన మార్క్ రాజకీయం చేశారు.

 మరికొద్ది గంటల్లో బీహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మరికొద్ది గంటల్లో బీహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ప్రధాని మోడీతో వేదిక పంచుకోవడానికి మనస్పూర్తిగా ఇష్టపడని నితీశ్ కుమార్.. మోడీ పేరుతో ఓట్లను అడిగారు. తిరిగి కూటమికి అధికారం కట్టబెడితే.. మోడీ అభివృద్ది చేస్తారని తెలిపారు. పాట్నా మెట్రో, స్మార్ట్ సిటీస్, ఉజ్వలా పథకం, బీహర్ రహదారులను అభివృద్ది చేస్తారని పేర్కొన్నారు.

Naya Nitish: Seeks votes in name of Modi, PM will develop Bihar

ఇక్కడికి వచ్చిన ప్రజలు మోడీ మాటలు వినడానికి మాత్రమే వచ్చారని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రించడం కోసం అసాధారణ ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. నితీశ్ తన ప్రసంగం ముగిసిన తర్వాత యుగ్ పురుష్ పేరుతో మోడీని పిలిచి మాట్లాడాలని కోరారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లలో 39 గెలవడానికి మోడీ పేరు కారణమైంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు వేర్వేరు.. కానీ ప్రధాని పేరుతో ఓట్లు అడగడం విశేషం.

Recommended Video

Bihar Elections Phase 1 : ఆర్ధికాంశాల ప్రభావంతో తమ ఓటును నిర్ణయించబోతున్నబీహారీలు...!!

2009 లోక్ సభ, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మోడీపై విమర్శలు గుప్పించారు. అప్పుడు మోడీ గుజరాత్ సీఎంగా ఉండేవారు. ఎన్డీఏ కోసం ప్రచారం చేయడానికి వస్తే.. ఇక్కడ సుశీల్ కుమార్ మోడీ ఉన్నారని.. మరో మోడీ అవసరం లేదని పేర్కొన్నారు. కానీ పదేళ్లలో నితీశ్ వైఖరి పూర్తిగా మారిపోయింది. అధికారం దూరమవుతుందని ఏమో కానీ.. స్వరం మారింది.

English summary
MARKING a full circle from the time he had refused to share stage with Prime Minister Narendra Modi, Bihar CM Nitish Kumar on Wednesday sought votes in his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X