వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ చార్జిషీట్‌ దాఖలు..200 మంది వాంగ్మూలాలతో పాటు పలు షాకింగ్ అంశాలు

|
Google Oneindia TeluguNews

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి లింక్ ఉన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) 11,700 పేజీల చార్జిషీట్‌ను ముంబై ప్రత్యేక కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. స్వయంగా ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే ఈ చార్జ్ షీట్ దాఖలు చేశారు . 2020 జూన్‌లో సుశాంత్ మరణించిన దాదాపు ఒక సంవత్సరం తరువాత, ఎన్‌డిపిఎస్ సెషన్స్ కోర్టులో 33 మంది నిందితులపై ఎన్‌సిబి చార్జ్ షీట్ ను సమర్పించింది. గతే ఏడాది ఆగస్టు చివరి వారంలో ఎన్‌సిబి ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్ జరిగిన 180 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో నేడు ఎన్సీబీ చార్జ్ షీట్ దాఖలు చేసింది .

కేసులో నిందితులుగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి సహాయకులు మరియు అనేక మంది డ్రగ్ పెడ్లర్లను ఎన్‌సిబి పేర్కొంది. దర్యాప్తులో 200 మంది వాంగ్మూలాలు ఎన్సీబీ దాఖలు చేసింది.చార్జిషీట్‌ను ఎన్‌సిబి ఎన్‌డిపిఎస్ సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. త్వరలో చార్జిషీట్‌ను కోర్టు అంగీకరిస్తుందని భావిస్తున్నారు. నిందితులకు కూడా చార్జిషీట్ ఇవ్వబడుతుంది . చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఇప్పుడు ఈ విషయంలో విచారణ తేదీని నిర్ణయిస్తుంది . ఆ తరువాత సాధారణ విచారణ ప్రారంభమవుతుంది.

 NCB chargesheet filed in Sushant Singh drugs case

చార్జిషీట్ 11,700 పేజీల పొడవు హార్డ్ కాపీలో మరియు 40,000 పేజీలు డిజిటల్ ఫార్మాట్‌లో కోర్టులో ఒక సిడిలో సమర్పించబడింది. చార్జిషీట్లో సుమారు 200 సాక్షి స్టేట్మెంట్లు చేర్చబడ్డాయి. నిందితులందరికీ నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు, చాలా మందికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన విషయాలను , వీరి నుండి డ్రగ్స్ రికవరీ చేసిన వివరాలను చార్జ్ షీట్ లో పేర్కొంది . డిజిటల్ సాక్ష్యాలతో కూడిన సాక్ష్యాలను కూడా ఎన్‌సిబి పేర్కొంది. కాల్ రికార్డులను సైతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమర్పించింది .

English summary
The Narcotics Control Bureau (NCB) has filed a 11,700-page chargesheet in the Sushant Singh Rajput drugs case on Friday. NCB submitted its charges against 33 accused persons and About 200 witness statements have been included .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X