వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Drug mafia:కరణ్ జోహార్ ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ పార్టీ ? కేసు, ఎన్ సీబీ ఎంట్రీ,SSR (వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు విషయంలో బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురౌతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీల పార్టీలో హీరో సుశాంత్ సింగ్ ను కరణ్ జోహార్ తీవ్రస్థాయిలో అవమానించారని, సుశాంత్ సింగ్ కు సినిమాల్లో అవకాశాలు రాకుండా ఆయన అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ సింగ్ మరణం, డ్రగ్స్ కేసు దందాలు కేసుల తరువాత బాలీవుడ్ కలో కలకలం రేపింది. ఇదే సమయంలో బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆరోపిస్తూ ప్రముఖ SAD పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ఎన్ సీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్స్ పార్టీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

 NCB డైరెక్టర్ ఎంట్రీ

NCB డైరెక్టర్ ఎంట్రీ

బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో 2019లో బాలీవుడ్ టాప్ స్టార్స్ తో డ్రగ్స్ పార్టీ జరిగిందని, ఈ విషయంపై మీరు విచారణ జరిపాలని శిరోమణి అకాలిదళ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిరా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (NCB)డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్తానాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన బాలీవుడ్ స్టార్స్ పార్టీకి సంబంధించిన వీడియోను సైతం ఎన్ సీబీ డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్తానాకు అందించారు.

 డ్రగ్స్ పార్టీ కేసు విచారణ చెయ్యాలి

డ్రగ్స్ పార్టీ కేసు విచారణ చెయ్యాలి

శిరోమణి అకాలిదళ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా రిపబ్లికన్ టీవీ చానల్ ప్రతినిధి నారాయణస్వామితో మాట్లాడుతూ 2019లో కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన డ్రగ్స్ పార్టీపై మళ్లీ విచారణ జరిపించాలని ఎన్ సీబీ డైరెక్టర్ రాకేష్ అస్తానాకు మనవి చేశామని, అందుకు ఆయన సానుకూలంగా స్పంధించారని అన్నారు. కరణ్ జోహార్ ఇంటిలో పెద్దఎత్తున బాలీవుడ్ స్టార్స్ హాజరైన సమయంలో డ్రగ్స్ పార్టీ జరిగిందని, ఆ వీడియో మా దగ్గర ఉందని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు.

 ముంబాయి పోలీసులు వేస్ట్

ముంబాయి పోలీసులు వేస్ట్

కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి తాను ఇప్పటికే ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా వారు కనీసం పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ముంబాయి పోలీసులు కరణ్ జోహార్ తో కలిసిపోయి ఉండాలి ? లేదా, డ్రగ్స్ కేసు వారికి సర్వసాధారణం అని పట్టించుకోకుండా ఉండాలి అనే అనుమానాలు తనకు వ్యక్తం అవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు.

 బాలీవుడ్ లో నల్ల గొర్రెలు

బాలీవుడ్ లో నల్ల గొర్రెలు

బాలీవుడ్ లో కొన్ని నల్ల గొర్రెలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన డ్రగ్స్ కేసును తేలిగ్గా తీసుకుని నిర్లక్షం చేసిన ముంబాయి పోలీసులపై తాను కోర్టులో న్యాయపోరాటం చేస్తానని, వారిమీద సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని మనవి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు.

బాలీవుడ్ స్టార్స్ వీళ్లే

బాలీవుడ్ స్టార్స్ వీళ్లే

2019లో ముంబాయిలోని కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన పార్టీకి బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీలు దీపికా పదుకొనే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌషల్ తదితరులు హాజరైనారని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. వీరందరు కెమెరాల కంటికి కనిపించకుండా ఒకరి చేతికి ఒకరు డ్రగ్స్ అందించుకున్నారని, అయితే ఆ స్టార్ నటీ నటులు అందరూ వీడియోలో ఉన్నారని అన్నారు.

బాలీవుడ్ స్టార్స్ పార్టీ వీడియో వైరల్

2019లో ఓ శనివారం రాత్రి కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ పార్టీ వీడియోలో కరణ్ జోహార్ తో పాటు దిపికా పదుకొనే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ కపూర్, వరుణ్ ధావన్, నటాషా దలాల్, జోయా అక్తర్, మిలంద్ డియోరా భార్య పూజా శెట్టి, జోయా అక్తర్, విక్కీ కౌషల్, అయాన్ ముఖర్జీ తదితరులు ఉన్నారని వెలుగు చూసింది. ఈ వీడియోను కరణ్ జోహార్ స్వయంగా చిత్రీకరించారని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు.

Recommended Video

COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
 కెమెరా కంటికి చిక్కకుండా !

కెమెరా కంటికి చిక్కకుండా !

వీడియోలో కొందరు చెయ్యి ముక్కు దగ్గర పెట్టుకుని రుద్దుతున్నట్లు కనిపిస్తోంది. వీడియో ఓ తెల్లటి పదార్థం మెరుస్తూ కనిపిస్తోంది. అయితే అది డ్రగ్సా ? లేకా లైటింగ్ కాంతినా ? అనే విషయం అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. పార్టీలో కొందరు కెమెరా కంటికి చిక్కకుండా డ్రగ్స్ దాచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద 2019లో కరణ్ జోహార్ ఇంటిలో డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆరోపిస్తూ విడుదలైన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో బాలీవుడ్ లో కలకం రేపింది. వీడియోలో ఉన్న కొందరు సెలబ్రిటీలు ఎక్కడ మామీద ఎన్ సీబీ అధికారులు పంజా విసురుతారో అంటూ హడలిపోతున్నారని సమాచారం. మొత్తం మీద SAD పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా విడుదల చేసిన వీడియో దెబ్బకు కొందరికి చెమటలు పడుతున్నాయని సమాచారం.

English summary
Drug mafia: NCB officers files FIR against Karan Johar related to a old party video that went viral few days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X