వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట‌చ్‌లో ఉన్నామంటున్న పవార్.. అదేంలేదన్న జగన్, కేసీఆర్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. మోడీ రెండోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా యూపీఏ నాయకులు ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మూడు పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్, వైసీపీతో మంతనాలు

టీఆర్ఎస్, వైసీపీతో మంతనాలు

లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీలు ప్రభంజనం సృష్టిస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఇప్పటి వరకు కేంద్రంలో ఏ పార్టీకి మద్దతిస్తాయన్న అంశంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు ఒడిశాలో బిజూ జనతాదళ్ సైతం ప్రస్తుతానికి తటస్థంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్, టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 కేసీఆర్‌తో పవార్ భేటీ?

కేసీఆర్‌తో పవార్ భేటీ?

వైసీపీ అధినేత జగన్‌ను కలిసేందుకు పవార్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆయన అప్పట్లో విదేశీ పర్యటనలో ఉన్నందున అది కుదరలేదని సమాచారం. అయితే ఈ విషయాన్ని వైసీపీ ధ్రువీకరించలేదు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన ఫామ్ హౌస్‌లో భేటీ అయినట్లు ఎన్సీపీ చెబుతోంది. కేంద్రంలో హం

భేటీపై స్పందించని బీజేడీ

భేటీపై స్పందించని బీజేడీ

21 లోక్‌సభ సీట్లున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ సైతం యూపీఏకు మద్దతిస్తామని ప్రకటించారని ఎన్సీపీ అంటోంది. గతేడాది ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నిక సమయం నుంచి ఆయనతో టచ్‌లో ఉన్నట్లు పవార్ చెబుతున్నారు. ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. అయితే యూపీఏకు మద్దతిచ్చే అంశంపై పవార్‌కు ఇచ్చిన హామీపై స్పందించేందుకు సీఎం నవీన్ పట్నాయక్ కార్యాలయం నిరాకరించింది.

యూపీఏలో కీలక నేతగా శరద్ పవార్

యూపీఏలో కీలక నేతగా శరద్ పవార్

కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎప్పటి నుంచో కూటమి ప్రయత్నాలు ప్రారంభించారు. షెడ్యూల్ వెలువడక ముందు నుంచే కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ మద్దతు కూడగట్టే యత్నం చేస్తున్నారు. ఎగ్జిట్ ఫలితాలు వెలువడిన అనంతరం వాటిని మరింత ముమ్మరం చేసిన ఆయన... వివిధ పార్టీల నేతలతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్నారు.

English summary
NCP Chief Sharad Pawar, was busy to reach out to leaders from three non- BJP parties that have largely remained away from the Opposition alliance talks so far. Pawar was getting in touch with the Biju Janata Dal, the Telangana Rashtra Samithi, and the YSR Congress Party . However those parited denied of meeting ncp chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X