వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1995 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శరద్ పవార్: శివసేన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ ‘సీఎంపీ’ పట్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. శివసేనతో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారో తెలుసా? సహేతుకమైన కారణాలివే..మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారో తెలుసా? సహేతుకమైన కారణాలివే..

మూడు పార్టీల కసరత్తు..

మూడు పార్టీల కసరత్తు..

మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అన్ని పార్టీలకు ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత అహ్మద్ పటేల్ ముంబైకి చేరుకున్నారు. ముసాయిదాను రూపొందించేందుకు ఈ మూడు పార్టీల నేతలు కసరత్తులు చేస్తున్నారు.

రాష్ట్రపతి పాలన విధించడంపై..

రాష్ట్రపతి పాలన విధించడంపై..

అసెంబ్లీని మనుగడలో లేకుండా చేసి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించాయి. ఇప్పటికే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సమయం ఇవ్వలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

సీఎంపీకి కాంగ్రెస్ పట్టు..

సీఎంపీకి కాంగ్రెస్ పట్టు..

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం పూర్తిస్థాయిలో ఒక కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంత్రి పదవుల పంపకం, శివసేనకు సంప్రదాయంగా వస్తున్న హిందుత్వ-మహారాష్ట్ర భావనను పక్కన పెట్టేందుకు కోసం కామన్ మినిమమ్ ప్రొగ్రాం(సీఎంపీ)ని కూడా తీసుకొచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

1995 ఫార్ములా తెరపైకి తెచ్చిన శరద్ పవార్

1995 ఫార్ములా తెరపైకి తెచ్చిన శరద్ పవార్


కాంగ్రెస్, శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పించేందుకు శరద్ పవార్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం బయటి నుంచి మద్దతి ఇస్తుంది లేదంటే ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవుతుంది. 1995లో ఏర్పాటైన ప్రభుత్వంలో శివసేన నుంచి ముఖ్యమంత్రి ఉండగా, డిప్యూటీ సీఎంతోపాటు హోంమంత్రి, ఆర్థికశాఖను బీజేపీకి కేటాయించారు. దాదాపు అదే ఫార్ములాను కాంగ్రెస్-ఎన్సీపీలు కూడా 1999లో రిపీట్ చేశాయి. ఇప్పుడు కూడా 1995 ఫార్ములానే శరద్ పవార్ తెరపైకి తెస్తున్నారు. అయితే, చెరో రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిని పంచుకోవడంపై కూడా ఎన్సీపీ ఆలోచన చేస్తోంది.

మమ్మల్ని సంప్రదించకుండానే..

మమ్మల్ని సంప్రదించకుండానే..

కాంగ్రెస్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చావన్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పాలన విధించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండానే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం దారుణమన్నారు. అయితే, శివసేనతో కలిసి ఎన్సీసీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై ఒప్పందం చేసుకునే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్ వల్లే ఆలస్యం.. బీజేపీ వెయిటింగ్..

కాంగ్రెస్ వల్లే ఆలస్యం.. బీజేపీ వెయిటింగ్..

శివసేనతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలను చేసినప్పటికీ.. కాంగ్రెస్ మద్దతు కీలకంగా మారింది. అయితే, శివసేన భావజాలంతో సుముఖంగా లేని కాంగ్రెస్ ఈ రెండు పార్టీల ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో ఆలస్యం చేసింది. ఇక ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో లేదని ఉద్దేశంతో మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. కాగా, రాష్ట్రపతి ఆమోదంతో ప్రెసిడెంట్ రూల్ అమల్లోకి వచ్చింది. ఇది ఇలావుంటే, బీజేపీ మాత్రం ఎన్సీపీ-శివసేన విభేదాలు చోటు చేసుకుంటాయని, లేదంటే ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీ వైపు మొగ్గుచూపుతారని భావిస్తోంది.

English summary
The Centre’s imposition of President’s rule in Maharashtra came within hours of Congress president Sonia Gandhi and NCP chief Sharad Pawar agreeing on drawing up a tripartite pact with Shiv Sena on the larger contours of sharing power in the state. Following the decision, a delegation led by senior Congress leader Ahmed Patel had reached Mumbai to draft the agreement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X