వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్‌ పవార్‌తో సంప్రదింపులు, డిప్యూటీ సీఎం పదవీకి రాజీనామాకు డిమాండ్, శరద్ పవార్ అల్టిమేటం..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ట్విస్ట్‌కు కారణమైన అజిత్ పవార్‌పై శరద్ పవార్, కుటుంబసభ్యుల ఒత్తిడి పెరిగింది. డిప్యూటీ సీఎం పదవీకి రాజీనామా చేయాలని అల్టిమేటం జారీచేశారు. జరిగిన ఘటనపై శదర్ గుర్రు మీదున్నారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పారు. మరోవైపు అజిత్ పవార్‌తో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎన్సీపీకి మద్దతిస్తామని స్పష్టంచేశారు. తమను అజిత్ పవార్ తప్పుదోవ పట్టించారని విమర్శించారు. తమను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లి.. ఒబెరాయ్ హోటల్లో బందీ చేశారని పేర్కొన్నారు. తాము శరద్ పవార్‌కు మద్దతు తెలిపిందేకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

అజిత్ సోదరుడికి..

అజిత్ సోదరుడికి..

అజిత్ పవార్‌ను తిరిగి సొంతగూటికి రావాలని శరద్ పవార్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన సోదరుడు శ్రీనివాస్ పవార్ తేల్చిచెప్పారు. మరోవైపు రోహిత్ పవార్ కూడా రంగంలోకి దిగారు. తిరిగి పార్టీలోకి రావాలని అజిత్ పవార్‌ను కోరారు. మరోవైపు ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా అజిత్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు.

రంగంలోకి జయంత్

రంగంలోకి జయంత్

అజిత్ పవార్ ఇంటికెళ్లి మరీ మాట్లాడారు. తిరిగి పార్టీలోకి రావాలని తాను కోరినట్టు జయంత్ పేర్కొన్నారు. తన మాటకు ఆయన విలువ ఇస్తారని.. బలనిరూపణ లోపు తమతో అజిత్ ఉంటారని జయంత్ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలతో శరద్ పవార్

ఎమ్మెల్యేలతో శరద్ పవార్

మరోవైపు రెనోసా హోటల్‌లో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని వారికి వివరించినట్టు తెలుస్తోంది. 49 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని ఎన్సీపీ నేతలు చెప్తున్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగొస్తారని పేర్కొన్నారు. అజిత పవార్ రాకతో తమ మొత్తం ఎమ్మెల్యేలు 54 తమతో ఉంటారని ఎన్సీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త కాదు.. కానీ

కొత్త కాదు.. కానీ

అజిత్ పవార్ ఇప్పుడే కాదు గతంలో కూడా తిరుగుబాటు ఎగరవేశారు. రాజీనామాస్త్రం ప్రయోగించి కూడా తిరిగి పార్టీలో చేరిపోయారు. మరోసారి డిప్యూటీ సీఎం పదవీకి ఆశపడి ధిక్కార స్వరం వినిపించారు. అజిత్ పవార్ కీలక అనుచరుడు ధనుంజయ ముండే కూడా శరద్ పవార్ చేరడంతో.. అజిత్ పవార్ వైపు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉంటే శివసేన కూటమికి 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. బీజేపీకి సంఖ్యాబలం లేదని గుర్తుచేశారు.

English summary
NCP is making last-ditch efforts to bring back Ajit Pawar to the party fold just a day after he sided with the bjp to form the Maharashtra government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X