వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

104 మంది శిశువులు బలి.. పార్టీల చెత్తరాజకీయాలు.. ఎన్సీపీసీఆర్ రిపోర్టులో అసలు నిజాలు

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ లో మూడో అతిపెద్ద నగరం కోటాలో పసికందుల మరణాలపై సంచలన నిజానలు వెలుగులోకి వచ్చాయి. కోటాలోని జేకే లోన్ ప్రభుత్వాసుపత్రిలో గత నెల రోజులుగా 104 మంది శిశువులు చనిపోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై గెహ్లాట్ సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ.. డాక్టర్లు, ఆస్పత్రికి క్లీన్ చిట్ ఇవ్వగా, బీజేపీ నేతల ఆధ్వర్యంలోని కమిటీ మాత్రం భిన్నమైన రిపోర్టు ఇచ్చింది. దీంతో పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు మరింత అయోమయానికి గురవుతున్నారు. చిన్నారుల్ని కాపాడాల్సిందిపోయి అధికార, ప్రతిపక్ష పార్టీలు చెత్తరాజకీయాలకే పరిమితమైపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చావులకు ఎవరూ బాధ్యులు కారట!

చావులకు ఎవరూ బాధ్యులు కారట!

చినిపోయిన శిశువులంతా సీరియస్ కండిషన్ లో ఉన్నవాళ్లేనని, వారిలో కొందరు నెలలు నిండకముందే పుడితే, ఇంకొందరు తక్కువబరువుతో పుట్టినవాళ్లని జేకే లోన్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్ దురాలా చెప్పారు. డిసెంబర్ 31 వరకూ మరణాలు చోటుచేసుకున్నాయని, సోమవారం నలుగురు, మంగళవారం మరో ఐదుగురు శిశువులు చనిపోయారని ఆయన వివరించారు. చిన్నారుల మరణాలకు సంబంధించి డాక్టర్లవైపుగానీ, సిబ్బందివైపుగానీ ఎలాంటి తప్పు జరగలేదని దురాలా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల హైలెవల్ కమిటీ కూడా నిర్ధారిస్తూ.. డాక్టర్లు, ఆస్పత్రికి క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. బీజేపీ నేతలు సొంతగా ఏర్పాటుచేసిన కమిటీ మాత్రం ప్రభుత్వ నిర్లక్షం వల్లే పిల్లలు చనిపోయారని పేర్కొంది.

బాలల హక్కుల కమిషన్ ఎంట్రీతో..

బాలల హక్కుల కమిషన్ ఎంట్రీతో..

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో జేకే లోన్ ఆస్పత్రిలో శిశువుల మరణాల ఉదంతం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు కొట్లాడుకుంటున్నవేళ.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆప్ చైల్డ్ రైట్స్( జాతీయ బాలల హక్కుల కమిషన్-ఎన్సీపీసీఆర్) విడుదల చేసిన రిపోర్టు సంచలనంగా మారింది. శిశువుల మరణాలను సుమోటో కేసుగా తీసుకున్న హక్కుల కమిషన్.. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ నేతృత్వంలో ఒక టీమ్ ను కోటాకు పంపింది.

ఇవీ అసలు నిజాలు..

ఇవీ అసలు నిజాలు..


బాలల హక్కుల కమిషన్ రిపోర్టు ప్రకారం.. జేకే లోన్ ఆస్పత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రి కాంపౌండ్ లో, చుట్టుపక్కల ఎక్కడ చూసినా బురదమయంగా, వాటిలో పందుల గుంపులు పొర్లాడుతూ కనిపించాయి. శిశువులను ఉంచి చికిత్స అందించే ఇంక్యుబేషన్ యూనిట్లు సరిగా పనిచేయడంలేదు. ఇంక్యుబేషన్ వార్డులో చాలా చోట్ల కిటికీల అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. చలిగాలుల తీవ్రత కూడా చిన్నారుల మరణాలకు ఒక కారణమై ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. పిల్లల వార్డులో సరిపడా డాక్టర్లుగానీ, సిబ్బందిగానీ లేరని కూడా తేలింది. కాగా, ఎన్సీపీసీఆర్ రిపోర్టుపై రాజస్థాన్ సర్కారు ఇంకా స్పందించలేదు.

English summary
The National Commission for Protection of Child Rights said its team found broken windows and gates, pigs roaming in Kota JK Lon hospital campus and an acute shortage of staff
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X