వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో పొత్తు పాలిటిక్స్... ఆ పార్టీకి ఐదు సీట్లు కేటాయించిన బీజేపీ

|
Google Oneindia TeluguNews

కేరళ: ఎన్నికలకు రాజకీయపార్టీలు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పొత్తులు ఓకొలిక్కి వస్తున్నాయి. బీజేపీ పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే కేరళలో భారత్ ధర్మ జనసేన పార్టీతో ఎన్డీఏ కూటమి పొత్తు కుదుర్చుకుంది. ఇక భారత్‌ ధర్మ జనసేన పార్టీకి ఎన్డీఏ 5 సీట్లు కేటాయించింది. ఇందులో త్రిసూర్, మావెలిక్కర, ఇడుక్కి, అలతూర్ , వాయనాడ్‌ లోక్‌సభ స్థానాలను కేటాయించింది. ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో చర్చలు జరిపిన తర్వాత బీడీజేఎస్ అధ్యక్షుడు మరియు ఎస్ఎన్డీపీ యోగం వైస్ ప్రెసిడెంట్ తుషార్ వెళ్లపల్లి త్రిసూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

NDA allocates five seats for BDJS in Kerala

అయితే మిగతా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ, మావెలిక్కర నుంచి తజవ సహదేవన్‌ను బరిలోకి దించాలని బీడీజేఎస్ భావిస్తోంది. సహదేవన్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కున్నతూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. పపన్ సామాజిక వర్గానికి ఆయన నాయకుడు. ఇదిలా ఉంటే కేరళ పులయార్ మహాసభ ఛీఫ్ టీవీ బాబు బీడీజేఎస్ తరపున అలతూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నట్లు సమాచారం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీ బాబు బీడీజేఎస్ అభ్యర్థిగా నట్టిక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 22.49 శాతం ఓట్లు సాధించారు.

భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఇక ఎస్‌ఎన్‌డీపీ తోడుపుజా మాజా కార్యదర్శి బిజు క్రిష్ణన్ బీడీజేఎస్ అభ్యర్థిగా ఇడుక్కి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. బిజుక్రిష్ణన్ మాజీ జిల్లా పంచాయత్ సభ్యులుగా పనిచేశారు. ఇక వాయనాడ్ నుంచి ఆంటో అగస్టీన్‌ను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోంది.

English summary
The National Democratic Alliance (NDA) has allocated five seats for the Bharat Dharma Jana Sena (BDJS), the second-largest constituent of the front in Kerala. According to BDJS leaders, the NDA has allotted Thrissur, Mavelikkara, Idukki, Alathur and Wayanad seats to the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X