వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌ ఫలితాల్లో క్షణక్షణం ఉత్కంఠ- అతిపెద్ద పార్టీగా తిరిగి ఆర్జేడీ- హంగ్ తప్పదా ?

|
Google Oneindia TeluguNews

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైన సమయంలో ఉన్న ట్రెండ్‌ మధ్యాహ్నానానికి పూర్తిగా మారిపోయి ఎన్డీయే ఆధిక్యం సాధించినా .. సాయంత్రం కల్లా తిరిగి బీజేపీ వెనుకబడటం ఎన్డీయే కూటమిలోని పార్టీలను కలవరపెడుతోంది. దీనికి తోడు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా సహా పలువురు మహాకూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. అసలే అర్ధరాత్రి వరకూ కౌంటింగ్‌ తప్పదని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో రాత్రికి ఫలితాలు ఏ మలుపు తీసుకుంటాయో అన్న ఆందోళన నేతల్లో పెరుగుతోంది.

బీహార్‌ ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యం- ఆర్జేడీ మినహా రాణీంచని మిత్రపక్షాలు..బీహార్‌ ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యం- ఆర్జేడీ మినహా రాణీంచని మిత్రపక్షాలు..

తిరిగి అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ...

తిరిగి అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ...

ఉదయం బీహార్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కాగానే ఎన్జీయే, మహాకూటమి రెండూ హోరాహోరీగా ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చాయి. ఏ కూటమి గెలుస్తుందో చెప్పే పరిస్ధితే లేకుండా పోయింది. అయితే ఆర్జేడీ మాత్రం అతిపెద్ద పార్టీగా ఆధిక్యం కొనసాగించింది. కానీ తిరిగి కాసేపటికే ఎన్డీయే ఆధిక్యంలోకి వచ్చేసింది. దాంతో పాటే బీజేపీ కూడా అతిపెద్ద పార్టీగా ఆధిక్యంలోకి వచ్చింది. చూస్తుండగానే సాధారణ మెజారిటీని కూడా అందుకుంది. దీంతో మహాకూటమి చేతులెత్తేసినట్లేనని అంతా భావించారు. సాయంత్రం వరకూ ఇదే ట్రెండ్‌ కొనసాగింది. కానీ సాయంత్రం దాటాక తిరిగి ఆర్జేడీ అభ్యర్ధులు ఆధిక్యం కొనసాగించడంతో తిరిగి ఆ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏడు గంటలకు అందిన తాజా వివరాల ప్రకారం ఆర్జేడీ 79 సీట్లతో అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా.. బీజేపీ 72 స్దానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది.

పడిపోతున్న జేడీయూ ఆధిక్యం...

పడిపోతున్న జేడీయూ ఆధిక్యం...

మరోవైపు ఎన్డీయేలో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ పరిస్ధితి కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. ఓ దశలో 58 స్ధానాల్లో ఆధిక్యత కొనసాగించిన జేడీయూ తాజా వివరాలు అందే సమయానికి 40 స్దానాలకు పరిమితమైంది. మరికొందరు జేడీయూ అభ్యర్ధులకూ వెనుకంజ తప్పడం లేదు. జేడీయూ పోటీ చేసిన పలు స్దానాల్లో చిరాగ్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్ధులు భారీగా ఓట్లు చీల్చినట్లు వార్తలు వస్తున్నాయి. నితీశ్‌ కుమార్‌ లక్ష్యంగా 143 స్ధానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన లోక్‌ జనశక్తి పార్టీ జేడీయూ అభ్యర్ధుల పాలిట శాపంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో జేడీయూ మరిన్ని స్దానాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

Recommended Video

#Biharelectionresults2020: EVMs Are Robust, Tamper-Proof, SC Upheld Its Integrity More Than Once: EC
 పుంజుకున్న మహాకూటమి..

పుంజుకున్న మహాకూటమి..


ఎన్డీయే భాగస్వాములైన బీజేపీ, జేడీయూ పలు స్ధానాల్లో తమ ఆధిక్యత కోల్పోతుండగా.. ఆ మేరకు మహాకూటమి పార్టీలు ఆధిక్యంలోకి వస్తున్నాయి. దీంతో మెజారిటీల్లోనూ భారీ మార్పులు తప్పడం లేదు. ఓ దశలో 122 సీట్ల సాధారణ మెజారిటీని అందుకున్న ఎన్డీయే తాజా సమాచారం మేరకు 119 స్ధానాలకు పరిమితమవుతోంది. అదే సమయంలో మహాకూటమి తమ భాగస్వామ్య పార్టీలకు చెందిన అభ్యర్దుల ఆధిక్యంతో తిరిగి మెజారిటీకి చేరువవుతోంది. సాయంత్రం ఏడుగంటల కల్లా మహాకూటమి 116 స్దానాల్లో ఆధిక్యంలోకి వచ్చేసింది. అంటే మెజారిటీకి మరో ఆరు స్ధానాల దూరంలో ఉంది. కౌంటింగ్‌ అర్దరాత్రి వరకూ సాగే అవకాశం ఉండటంతో ఏదైనా జరగొచ్చని అంటున్నారు.

English summary
bihar assembly election counting is going on slowly but sensationally as nda continues in leading but tejashwi yadav led rjd emerges as single largest party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X