వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే: తెలంగాణలో కొనసాగుతున్న కారుజోరు...దక్షిణాదిలో పెరిగి బీజేపీ ఓటుశాతం

|
Google Oneindia TeluguNews

ఎన్నికలవేళ సర్వేల హోరు సాగుతోంది.తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ వీఎంఆర్ సంయుక్త సర్వే తన ఫలితాలను బయటపెడుతూ వాటిపై విశ్లేషణ చేసింది. గతంలో అంటే జనవరిలో ఇదే ఛానెల్ విడుదల చేసిన సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వఏర్పాటుకు కొన్ని సీట్లు తక్కువగా వస్తాయంటూ పేర్కొంది. అయితే తాజాగా చేసిన సర్వే ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.

ఎన్నికల హోరు...సర్వేల జోరు

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నెలరోజులు సమయం కూడా లేదు. ఇప్పటికే పార్టీలన్నీ తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అదే సమయంలో సర్వేలు తమ ఫలితాలతో మరింత హీట్‌ను పెంచుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ మరియు వీఎంఆర్ సంయుక్తంగా చేసిన సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. జనవరిలో ఒకసారి సర్వే చేసిన ఇవే సంస్థలు నాడు ఎన్డీఏ కూటమికి కాస్త కష్టకాలమే అన్నట్లుగా చెప్పుకొచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు తక్కువగా వస్తాయని పేర్కొంది. అయితే తాజా సర్వేలో మాత్రం జనవరి తర్వాత జరిగిన రెండు ప్రధాన ఘటనలతో దేశ ప్రజలు తిరిగి ఎన్డీయేకే పట్టం కట్టనున్నట్లు జోస్యం చెప్పింది.

బడ్జెట్, పాక్‌పై వైమానిక దాడుల ప్రభావం

ఇక జనవరి తర్వాత దేశంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పిన సర్వే... అందులో రెండు ప్రధాన అంశాలు మాత్రం దేశ ప్రజలను ప్రభావితం చేసి ఎన్డీఏ కూటమివైపు తిప్పాయని సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రజలను ఆకట్టుకుందని సర్వే పేర్కొంది. ఆ తర్వాత ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ పై వైమానిక దాడులను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించడంతో ప్రజలు తిరిగి మోడీకే పట్టం కట్టేందుకు సిద్దపడ్డారని వెల్లడించింది. ఇక మార్చిలో ఈ సర్వేని చేసి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో టైమ్స్‌నౌ వీఎంఆర్ సర్వే వెల్లడించింది.

తెలంగాణలో దూసుకెళుతున్న కారు

ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ విషయానికొస్తే... 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణలో కారు జోరు ఊపందుకుందని తెలిపింది. కారు వేగాన్ని అందుకోవడం ఏ పార్టీ తరం కాదని సర్వే తేల్చేసింది. టీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలను కైవసం చేసుకోనుందని చెప్పిన సర్వే... బీజేపీ 2 స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానం ఎంఐఎం ఒక స్థానాల్లో విజయం సాధించనున్నట్లు స్పష్టం చేసింది. ఇక కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అటు ఇటూ అయితే థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే కచ్చితంగా గులాబీ బాస్ కేసీఆర్ సహాయం ఆశించక తప్పదు.

2014లో ఓటు షేరు ఇలా ఉంది:
కాంగ్రెస్ 24.5 శాతం, బీజేపీ 10.4శాతం, టీఆర్ఎస్ 34.7శాతం, ఇతరులకు 30.4 శాతం

2019 మార్చిలో ఓటు షేరు ఇలా ఉంది:

కాంగ్రెస్ 30.30 శాతం, బీజేపీ 17.60శాతం, టీఆర్ఎస్ 41.20శాతం, ఇతరులకు 10.90 శాతం

2014లో సీటు షేరు:
కాంగ్రెస్ 2, బీజేపీ 1, టీఆర్ఎస్ 12, ఇతరులకు 02

మార్చి 2019: కాంగ్రెస్ 1, బీజేపీ 2, టీఆర్ఎస్ 13, ఇతరులకు 01

తమిళనాడులో డీఎంకేకు భారీ మెజార్టీ

తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలుండగా కాంగ్రెస్ డీఎంకేలకు కలిసి 34 స్థానాలు వస్తాయని బీజేపీ అన్నాడీఎంకేలకు కలిసి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే జోస్యం చెప్పింది. తమిళనాడులో మాత్రం ఈసారి డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది. ఇక ఓటు షేరు చూస్తే కాంగ్రెస్ డీఎంకేలకు కలిసి 52.20 శాతం వస్తుండగా..బీజేపీ అన్నాడీఎంకేలకు 37.20శాతంగా ఉంది.

కేరళలో త్రిముఖ పోరు తప్పదు

కేరళలో 20లోక్‌సభ స్థానాలుండగా అక్కడ త్రిముఖపోరు నెలకొననుందని సర్వే వెల్లడించింది. అయితే ఈ త్రిముఖ పోరులో యూడీఎఫ్‌కు 16 సీట్లు బీజేపీ మిత్ర పక్షాలకు 1 సీటు ఎల్డీఎఫ్‌కు 3 స్థానాలు వస్తాయని వెల్లడించింది. మరోవైపు ఓటు షేరు చూస్తే యూడీఎఫ్‌కు 45శాతం, బీజేపీ మిత్రపక్షాలకు 21.70 శాతం, ఎల్డీఎఫ్‌కు 29.20 శాతం ఉంటుందని సర్వే లెక్కలు కట్టింది.

కర్నాటకలో పెరగనున్న బీజేపీ స్థానాలు

ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త గట్టిగా పట్టున్న రాష్ట్రం కర్నాటక. కర్నాటకలో మొత్తం 28 స్థానాలుండగా యూపీఏకు 13 స్థానాలు, ఎన్డీఏకు 15 స్థానాలు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించినప్పటికీ కుమారస్వామి జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఓటు షేరు విషయానికొస్తే కాంగ్రెస్‌ జేడీఎస్‌కు 43.50 శాతం ఉండగా, బీజేపీ మిత్రపక్షాలకు 44.50 శాతం ఉన్నట్లు సర్వే డిక్లేర్ చేసింది. అయితే బాలాకోట్ దాడుల తర్వాత కర్నాటకలో బీజేపీ పుంజుకుందని సర్వే అంచనా వేసింది.

English summary
Times Now and VMR survey is back with yet another batch of poll-related data and analysis. In the last survey, the Times Now-VMR poll had shown that the National Democratic Alliance (NDA) would have been 21 seats short of the half-way mark had 2019 Lok Sabha Elections been held in January.However, since then, a number of events have taken place. Two of the most notable developments are - Interim Budget, which was said to have been exceptionally populist and the Balakot counter-terror operation which took place on February 26 in response to the Pulwama carnage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X