వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొందరేంలేదు, 5న విచారిస్తాం: ఎన్డీటీవీ పిటిషన్‌పై సుప్రీం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ఇండియా ప్రసారాలను ఒక్క రోజు నిలిపివేయాలని కేంద్రం జారీ చేసిన నిషేధ ఉత్తర్వులకు సంబంధించిన అంశంపై డిసెంబరు 5న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది.

పఠాన్‌కోట్‌ తీవ్రవాద దాడికి సంబంధించి కవరేజీ వ్యవహారంలో నవంబర్ 9న ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేయాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసి తర్వాత ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.

NDTV blackout- No urgency, we will hear it on Dec 5 says SC

అయితే కేంద్రం తమ ఛానల్‌పై ఒక రోజు నిషేధం వేయడాన్ని సవాలు చేస్తూ ఎన్డీటీవీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు డిసెంబరు 5న దీనిపై విచారణ చేయనున్నట్లు తెలిపింది.

ఎన్డీటీవీ అంశం విచారణపై తొందరేమీ లేదని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఇందుకు కోర్టుకు కూడా సానుకూలంగా స్పందించింది. డిసెంబర్ 5న విచారిస్తామని స్పష్టం చేసింది.

English summary
The Supreme Court today adjourned hearing a petition challenging the 1 day blackout on NDTV India. The court observed that there is no urgency in hearing the matter since the ban had been put on hold by the Information and Broadcasting Ministry on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X