వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాలకు వెళ్లకుండా ఎన్డీటీవీ కో ఫౌండర్స్ ప్రణయ్ రాయ్, రాధిక రాయ్‌లను ఎయిర్ పోర్టులో నిలుపుదల

|
Google Oneindia TeluguNews

ఎన్డీటీవీ కో ఫౌండర్స్ ప్రణయ్ రాయ్‌తోపాటు రాధిక రాయ్‌లను విదేశాలకు వెళ్లకుండా ముంబయి ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. కాగా సీబీఐ అధికారుల ఆదేశాలతోనే తాము విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. కాగా ఇద్దరు కూడ మని లాండరింగ్ కేసులో సీబీఐ విచారణను ఎదుర్కోంటున్నారు. ఇక ఈ చర్యను ఎన్డీటీవీ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇది మీడీయా స్వేఛ్చను అడ్డుకోవడమేనని ప్రకటనను విడుదల చేసింది.

ఇక ఈనెల 16వ తేదిన ఇండియాకు తిరిగి రావడానికి తిరుగు ప్రయాణం టికెట్లు కూడ ఇష్యూ అయ్యాయి. కాగా రెండు సంవత్సరాల క్రితం ఇద్దిరిపై మని లాండరింగ్ కేసు నమోదైంది. ఈనేపథ్యంలనే గత రెండు సంవత్సరాల నుండి ఇద్దరు కేసుకు సంబంధించి సహకరిస్తున్నరని వారు వివరించారు... ఇది మీడీయా సంస్థల పై దాడిగా అభివర్ణించారు. మరోవైపు ఎడిటర్స్ గిల్ట్ కూడ ఈ చర్యను ఖండించింది.

NDTV co-founders Prannoy and Radhika Roy were stopped from flying abroad

మరోవైపు ఎన్డీటీవీ ప్రమోటర్స్ గా ఉన్న ప్రణయ్ రాయ్‌తోపాటు రాధిక రాయ్‌లకు సెప్టెంబర్ 11, 2018న సెబి నుండి ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంగించారంటూ నోటీసులు జారిచేసింది.

English summary
NDTV co-founders Prannoy and Radhika Roy were stopped from flying abroad by authorities at Mumbai airport on Friday.According to sources, the airport authorities did not let the two fly as per a request filed by the Central Bureau of Investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X