వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంట పండింది: రైతుకు చిక్కిన రూ. 50 లక్షల విలువైన డైమండ్

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. ఈ వజ్రం 10.69 క్యారెట్లు ఉండటం గమనార్హం. రాణిపూర్ ప్రాంతంలోని గనిని లీజుకు తీసుకున్న ఆనందిలాల్ కుశ్వాహా ఆ వజ్రాన్ని స్థానిక వజ్రాల కార్యాలయంలో జమ చేసినట్లు పన్నా వజ్రాల అధికారి పాండే తెలిపారు.

ఈ విలువైన వజ్రాన్ని వేలం వేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులను తగ్గించిన తర్వాత ఆదాయాన్ని డిపాజిటర్‌కు ఇస్తామని వెల్లడించారు. వజ్రం విలువను వెల కట్టాల్సి ఉందన్నారు. అయితే, వజ్రం నాణ్యత ఆధారంగా రూ. 50 లక్షల విలువ చేస్తుందని స్థానిక నిపుణులు చెబుతున్నారు.

Nearly 11 Carat Diamond Worth Rs 50 Lakh Found In Panna Mine

కాగా, ఆనందిలాల్ ఇటీవలే 70 సెంట్ల వజ్రాన్ని కూడా కార్యాలయంలో జమ చేశారు. కరోనా లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఇక్కడ లభ్యమైన మొదటి పెద్ద వజ్రం ఇదేనని ఆనందిలాల్ కుశ్వాహా తెలిపారు. తనతోపాటు తన భాగస్వామి ఆరు నెలలుగా గనిలో చాలా కష్టపడుతున్నామని, అయితే, వజ్రం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నారు.

Recommended Video

Diamonds Hunt In Kurnool : Shepherd And Farm Laborer Found Diamonds

పన్నా డైమండ్ రిజర్వ్ ఏరియాలో స్థానిక రైతులకు ప్రభుత్వం లీజుకు ఇస్తోంది. గనుల్లో బయటపడిన విలువైన వజ్రాలు, రాళ్లను రైతులు తిరిగి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు అందజేస్తారు. ఇందుకు కొంత ప్రభుత్వ అధికారులు తగిన మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. మధ్యప్రదేశ్ బుంధేల్ ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లాలో అనేక వజ్రాలు బయటపడుతున్నాయి.

English summary
A poor farmer in Madhya Pradesh’s Panna district has harvested a sparkling fortune when he mined a high quality diamond weighing 10.69 carat in his land taken on lease from the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X