వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:ఢిల్లీ, తమిళనాడు దెబ్బతో లక్షా 65 వేల కేసులు,ట్వీ 20.20 క్రికెట్ స్కోర్ తో పోటీ, సీఎంలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చెన్నై/మదురై: భారతదేశంలో మూడు రాష్ట్రాల దెబ్బతో కరోనా పాజిటివ్ కేసులు టీ 20.20 క్రికెట్ స్కోర్ పెరిగిపోయినట్లు పెరిగిపోతున్నది. దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా రాష్ట్రంగా మహారాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 83 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దక్షిణ భారతదేశాన్ని గడగడలాడిస్తున్న తమిళనాడులో 82 వేలకు పైగా కరోనా పాజాటివ్ కేసులు నమోదైనాయి. ఇక తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో 53, 762 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వంతో పాటు చెన్నై నగర ప్రజలు హడలిపోతున్నారు.

Recommended Video

COVID-19 : Rajinikanth ఇంటికి Corona భయం.. బయటకు వెళ్లకుండా ఆదేశాలు! || Oneindia Telgu

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

 ఊహించని కరోనా కేసులు

ఊహించని కరోనా కేసులు

భారతదేశంలో ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. మార్చి 25వ తేదీ నుంచి భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేసి కరోనా వైరస్ కట్టడికి అనేక ప్రయత్నాలు చేశారు. లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ కట్టడి అయినట్లే అయ్యి లాక్ డౌన్ సడలింపుల తరువాత ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరిగిపోయాయి.

 దేశ రాజధాని ఢిల్లీ హడల్

దేశ రాజధాని ఢిల్లీ హడల్

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 2, 889 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 83, 007 నమోదైనాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 52, 607 మంది ప్రజలు కరోనా వైరస్ దెబ్బకు ఆసుపత్రుల్లో చికిత్స పోంది కరోనాతో పోరాటం చేసి వ్యాధి నయం చేసుకున్నారు.

 కేంద్రం, కేజ్రీవాల్ సర్కార్

కేంద్రం, కేజ్రీవాల్ సర్కార్

ఢిల్లీలో నేటి వరకు 27, 847 మంది కరోనా పాజిటివ్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాధితో ఇప్పటి వరకు 2, 623 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఢిల్లీలో కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

పేరు వింటే పరుగో పరుగు

పేరు వింటే పరుగో పరుగు

దక్షిణ భారతదేశంలో తమిళనాడు పేరు వింటేనే ప్రజలు పరుగుతు తీస్తున్నారు. తమిళనాడులో కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. తమిళనాడులో ఆదివారం రాత్రి వరకు 82, 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో ఆసుపత్రుల్లో చేరిన 35, 656 మంది వ్యాధి నయం చేసుకున్నారు.

 ఒక్కరోజులో రికార్డు బ్రేక్

ఒక్కరోజులో రికార్డు బ్రేక్

ఆదివారం ఒక్కరోజో తమిళనాడులో 3, 940 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై సిటీలో 53, 762 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఆదివారం ఒక్కరోజో చెన్నై సిటీలో 1, 992 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై ఇప్పటి వరకు 1, 079 మంది మరణించారు. ఒక్క ఆదివారం రోజు మాత్రమే కరోనా వైరస్ వ్యాధితో 54 మంది మరణించడంతో తమిళనాడు ప్రభుత్వంతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

English summary
Coronavirus: Nearly 4, 000 new COVID 19 cases in 24 hours in Tamil Nadu, Delhi reports 2, 889 new COVID 19 positive cases and 65 deaths today. Total number of cases stands at 83077 including 27847 active cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X