వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిసార్ట్ లో 40 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: కాళ్లు పట్టుకుంటాం, పరుగో పరుగు !

గోల్డన్ బే రిసార్ట్ లో ఉన్న 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెంటనే మమల్ని ఇంటికి పంపించాలని, మీ అంతకు మీరు నిర్ణయం తీసుకుని మా అభిప్రాయాలను గాలికి వదిలేశారని ఎదురు తిరగడంతో సీఎం పళనిసామి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎడప్పాడి పళనిసామికి అప్పుడే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. మమ్మల్ని రిసార్ట్ కు తీసుకోచ్చారని, మా ప్రమేయం లేకుండా మీఅంతకు మీరే నిర్ణయం తీసుకుని మా అభిప్రాయాలను గాలికి వదిలేశారని, మమ్మల్ని పట్టించుకోవడంలేదని శుక్రవారం ఎదురుతిరిగారు.

శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?

వెంటనే మమ్మలి ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలని శుక్రవారం దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారని వెలుగు చూసింది. అంతే విషయం తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కువత్తూరులోని గోల్డన్ బే రిసార్ట్ కు పరుగు తీశారు.

మా ఇంటికి పంపించండి

మా ఇంటికి పంపించండి

మమ్మల్ని మా ఇంటికి పంపించండి. మా కుటుంబ సభ్యులు, మా నియోజక వర్గం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఎవరికి మద్దతు ఇవ్వాలో అని తాము నిర్ణయించుకుంటామని రిసార్ట్ లో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు మన్నార్ గుడి గ్యాంగ్ పై ఎదురుతిరిగారని తెలిసింది.

తంబిదురై పరుగో పరుగు

తంబిదురై పరుగో పరుగు

40 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగారని తెలుసుకున్న లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై గోల్డన్ బే రిసార్ట్ కు పరుగు తీశారు. ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలను శనివారం అసెంబ్లీలో జరగనున్న బలనిరూపణలో ఎడప్పాడి పళనిసామికి మద్దతుగా ఓటు వెయ్యాలని వేడుకుంటున్నారు.

బెంగళూరు పర్యటన రద్దు

బెంగళూరు పర్యటన రద్దు

శుక్రవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ ఆశీర్వాదం తీసుకోవాలని ముందుగానే నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ఎదురు తిరగడంతో తన పర్యటన రద్దు చేసుకుని వెంటనే గోల్డన్ బే రిసార్ట్ చేరుకుని అసమ్మతి ఎమ్మెల్యేలకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని శుక్రవారం తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.

మమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు

మమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు

గురువారం ఎడప్పాడి పళనిసామి తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవరర్నర్ కు లేఖ ఇచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే సీఎం ప్రమాణస్వీకారానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరిని తీసుకురాలేదు. ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అంటూ 40 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గీయులను ప్రశ్నించారని తెలిసింది.

దినకరన్ కు పదవి ఇస్తారా ?

దినకరన్ కు పదవి ఇస్తారా ?

అమ్మ జయలలిత మెడపట్టుకుని బయటకు గెంటేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు టీవీవీ దినకరన్ కు మద్రాస్ హై కోర్టు ఫెరా కేసులో రూ. 25 లక్షల అపరాద రుసుం చెల్లించాలని తీర్పు ఇచ్చిందని, ప్రజలలో చెడ్డపేరు ఉన్న ఆయన్ను ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిని చేస్తారా ? ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారని అసమ్మతి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారని వెలుగు చూసింది.

మామాట వింటారా

మామాట వింటారా

ఇంటికి పంపించాలని ఎదురుతిరుగుతున్న 40 మంది ఎమ్మెల్యేలను నయానభయానా ఒప్పించడానికి శశికళ వర్గం ప్రయత్నిస్తున్నదని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే 40 మంది ఎమ్మెల్యేలను బయటకు పంపిస్తే సీన్ రివర్స్ అవుతుందని సీఎం, తంబిదురై, శశికళ వర్గం భావిస్తున్నారు.

నన్ను నమ్మండి మీకు న్యాయం చేస్తాం

నన్ను నమ్మండి మీకు న్యాయం చేస్తాం

ఎడప్పాడి పళనిసామి ఎమ్మెల్యేలను చేతులుపట్టుకుని అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో తనకు మద్దతుగా ఓటు వెయ్యాలని వేడుకుంటున్నారని తెలిసింది. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎడప్పాడికి ఓటు వెయ్యకుండా చేతులు ఎత్తెస్తే ఆయన ముచ్చటగా మూడు రోజుల ముఖ్యమంత్రి అయ్యి పదవికి రాజీనామా చెయ్యవలసిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Sources say that nearly 40 AIADMK MLAs are not happy CM Edappadi Palanisamy and want to go home immediately. Talks are on to pacify them by Thambidurai and CM himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X