వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60లక్షలకు చేరువగా..ఇండియాలో కరోనా కేసులు..అయినా రికవరీలో మనమే నంబర్ వన్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . తాజాగా 60 లక్షలకు చేరువగా కరోనా కేసులతో ఇండియా ఉంది . ఒకవైపు కరోనా బారిన పడిన వారి రికవరీ రేట్ పెరుగుతున్నప్పటికీ, అంతే సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తుంది . కరోనా వ్యాక్సిన్ కోసం ఇండియా యుద్ధ ప్రాతిపదికన క్లినికల్ ట్రయల్స్ చేస్తుంది . రికవరీల్లో ఇండియా టాప్ ప్లేస్ లో ఉండటం ఉపశమనం కలిగించే అంశం.

60 లక్షలకు చేరువగా ఇండియాలో కరోనా కేసులు

60 లక్షలకు చేరువగా ఇండియాలో కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 88,600 కొత్త కరోనావైరస్ కేసులు నమోదుకాగా , 1,124 మరణాలను నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశపు కరోనా కేసుల సంఖ్య 60 లక్షలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నమోదైన కరోనావైరస్ మొత్తం కేసులు ప్రస్తుతం 59,92,533 కేసులు కాగా , మరణించిన వారి సంఖ్య 94,503 కు చేరుకుంది. వీరిలో 49,41,628 మంది ఇప్పటివరకు కరోనా నుండి కోలుకుని ఇళ్ళకు చేరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 20,419 కొత్త కేసులు, 430 మరణాలు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో తగ్గని కరోనా ఉధృతి

మహారాష్ట్రలో తగ్గని కరోనా ఉధృతి

కరోనా నుండి కోలుకున్న వారు 23,644 మంది కాగా ,మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 13,21,176 , వీటిలో 2,69,119 క్రియాశీల కేసులు ఉన్నట్టు తెలుస్తుంది . 10,16,450 మంది డిశ్చార్జ్ అయ్యారు . ఇప్పటివరకు 35,191 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి . భారత్ లో కరోనా కేసులలో మహారాష్ట్ర అత్యంత ప్రభావితం అయిన తొలిరాష్ట్రంగా ఉంది . కరోనా ప్రారంభం అయిన తొలినాళ్ళ నుండి మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి .

Recommended Video

PM Modi Questions United Nations ఐరాసపై నిప్పులు చెరిగిన మోదీ || Oneindia Telugu
రికవరీలలో ఇండియాదే అగ్రస్థానం

రికవరీలలో ఇండియాదే అగ్రస్థానం

భారత్ లో కరోనా కేసులు అధికంగా ఉన్నా , అత్యంత ప్రభావిత దేశంగా ఇండియా ఉన్నా కరోనా రికవరీలో ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది . రికవరీ రేటు 82.14 శాతానికి పెరగడంతో, మొత్తం రికవరీలలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 32.7 మిలియన్లకు చేరుకుంది, మరణాలు 9,92,000 కు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆదివారం ఉదయం నాటికి, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,27,46,134 గా ఉంది . ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 9,92,946 కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) వెల్లడించింది.

English summary
India on Sunday recorded as many as 88,600 new coronavirus cases and 1,124 deaths in the last 24 hours, according to Union health ministry data. India's Covid-19 tally is nearing 60 lakh-mark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X