'ఆడియో & విజువల్ మీడియా - ప్రొడక్షన్ హెడ్' కావలెను
బెంగుళూరు: డిజిటల్ మీడియా రంగంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ సాప్ట్వేర్ సంస్ధ గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ఆన్లైన్ న్యూస్ పోర్టల్ వన్ఇండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వన్ఇండియాలో 'ఆడియో & విజువల్ మీడియా - ప్రొడక్షన్ హెడ్' కోసం ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
ఆడియో, వీడియో, విజువల కంటెంట్ సంబంధిత విషయాల్లో పూర్తి అవగాహన కలిగిన వారు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టీవి, ఇంటర్నెట్ న్యూస్, రేడియా, ప్యూచర్ ప్రోగ్రామింగ్ రంగాల్లో పని చేసిన వారు అర్హులు.

ఆడియో & విజువల్ మీడియా - ప్రొడక్షన్ హెడ్ జాబ్ విధి విధినాలు
* సొంతంగా ఆడియో, వీడియో, విజువల కంటెంట్ రంగంలో నిపుణులైన వారిని నియమించుకోవాలి.
* ఆన్లైన్ డిజిటల్ మీడియాకు సంబంధించి పూర్తి బాధ్యతను తీసుకోవాలి.
* స్కిప్ట్ రైటింగ్, ప్రజెంటింగ్, హై క్వాలిటీ వీడియోలను రూపొందించాలి.
* ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఆర్టికల్స్, ఆడియో, వీడియో కంటెంట్లను రూపొందించాలి.
* భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. ముఖ్యంగా రాయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
* ఇంటర్నెట్లో ఆడియో, వీడియోలకు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చే వారైతే ఇంకా మంచిది.
* ఎన్ని ఎక్కువ భారతీయ బాషలు తెలిసి ఉంటే అంత మీకు కలిసి వస్తుంది.
* ముఖ్యంగా న్యూస్ టీమ్, సేల్స్ టీమ్‌కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది.
* ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, స్కోలింగ్ లాంటి వాటిపై పూర్తి అవగాహన ఉంటే మంచిది.
* జర్నలిజంలో 5 నుంచి 7 ఏళ్ల అనుభవం గలవారు అయితే మంచిది.
* ఆడియో, వీడియో జర్నలిజంలో పీజీ డిగ్రీని కలిగి ఉంటే మంచిది.
* ఈ ఉద్యోగం బెంగుళూరులోనే ఉండి, అక్కడి ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుంది.
* మీ పనికి, పరిజ్ఞానానికి తగిన వేతనం ఉంటుంది.
* ప్రింట్, టెలివిజన్ మీడియాలో కన్నా వన్ఇండియా పోర్టల్‌లో పని పరిస్థితులు, యాజమాన్య ఉద్యోగుల మధ్య సత్సబంధాలు ఉంటాయని గర్వంగా హామీ ఇవ్వగలం.
'ఆడియో & విజువల్ మీడియా - ప్రొడక్షన్ హెడ్' పూర్తి జాబ్ విధి విధినాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా వన్ఇండియా న్యూస్ పోర్టల్ ఎనిమిది (తెలుగు, ఇంగ్లీషు, హిందీ,కన్నడ, తమిళం, మళయాళం మరియు గుజరాతీ) భాషలలో వార్తలను అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అలెక్సా ర్యాంకింగ్స్‌లో వన్ఇండియా న్యూస్ పోర్టల్ 1,060 ర్యాంకును కలిగి ఉంది.
భారత్‌లో 78వ ర్యాంకులో ఉంది. భారతీయ భాషలలో విశిష్టమైన సేవలందిస్తోన్న వన్ఇండియా సంస్ధ న్యూస్, ఎంటర్ట్మెంట్ కేటగిరీలో Comcore ర్యాంకింగ్‌లో 5వ స్థానంలో ఉంది.
తెలుగు వన్ఇండియా