వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలతో స్వాతంత్ర్యం రాదు,పెడదోవలో యువత : రావత్

By Narsimha
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: ఆయుధాలతో స్వాతంత్ర్యం రాదని, ఉగ్రవాదులు సైన్యంతో పోరాడలేరని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వడం ఆందోళనకరమని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. భద్రతా దళాలు గత ఆదివారం జరిపిన కాల్పుల్లో కశ్మీరుకు చెందిన అధ్యాపకుడు మహ్మద్‌ రఫి భట్‌ మరణించిన సంగతి తెలిసిందే. రఫి మరణం తర్వాత బిపిన్‌ రావత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Need to tell youth Azadi will never happen, you can’t fight us: Army Chief General Bipin Rawat

ఆయుధాలు చేపట్టినంత మాత్రాన కాశ్మీర్ యువత కోరుకొనే స్వాతంత్ర్యం రాదని ఆయన చెప్పారు. ఆజాదీ పేరుతో అరాచకం సృష్టించాలనుకుంటే సైన్యం చూస్తూ ఉండదన్నారు. అంతేకాదు మీరు కోరుకునే స్వతంత్రం ఎప్పటికి రాదని బిపిన్‌ రావత్‌ తెలిపారు. కొన్ని దేశవిద్రోహక శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రెండేళ్ల క్రితం 11 మంది యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది అంతేకాదు భద్రతాబలగాలు ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమార్చాయి.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని షోఫియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్‌ వనీ గ్యాంగ్‌ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు.

English summary
General Rawat said he is perturbed by the killings. “We don’t enjoy it. But if you want to fight us, then we will fight you with all our force. Kashmiris have to understand that the SFs (security forces) haven’t been so brutal — look at Syria and Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X