వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEET 2020 Answer Key:కొశ్చన్ పేపర్ పై సబ్జెక్టు వారీగా నిపుణుల విశ్లేషణ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఎన్నో అడ్డంకులు అనుమానాల మధ్య ఎట్టకేలకు నీట్ పరీక్ష ఆదివారం ముగిసింది. దాదాపు 85శాతం మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరైనట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. ఇక నీట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఇన్స్‌టిట్యూట్‌లు సమాధానాల కీ విడుదల చేశాయి. అయితే పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసే కీ ఫైనల్‌ అని ఆయా ఇన్స్‌టిట్యూట్‌లు తెలిపాయి. ఈ యాన్సర్ కీ ని ఆయా సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు రూపొందించారు. నీట్ 2020 పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరిగింది. మొత్తం 180 ప్రశ్నలు ఉండగా ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది. ఒక్కో తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్కు ఉంటుంది. ఇక అటెంప్ట్ చేయని ప్రశ్నలకు మాత్రం ఎలాంటి మార్కులు ఉండవు. నీట్ పరీక్ష పై విడుదల చేసిన కీ అధికార కీ కాదని నిపుణులు చెప్పారు. అధికారిక కీ ఎన్‌టీఏ వెబ్ ‌సైట్‌పై పొందుపరుస్తారు. ఇందుకోసం ntaneet.nic.inను సందర్శించాల్సి ఉంటుంది.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈజీగా ఫిజిక్స్ పేపర్

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈజీగా ఫిజిక్స్ పేపర్

ఇక సబ్జెక్ట్ వారీగా నిపుణులు కొశ్చన్ పేపర్‌ను విశ్లేషించారు. గతేడాది కొశ్చన్ పేపర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫిజిక్స్ పేపర్ కాస్త సులభంగానే వచ్చినట్లు నిపుణులు చెప్పారు. 30శాతం నుంచి 40శాతం వరకు ప్రశ్నలు డైరెక్ట్‌గా ఉన్నట్లు చెప్పారు. ఇవన్నీ కూడా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచే అడిగినట్లు నిపుణులు చెబుతున్నారు. గ్రాఫ్స్, డేటా, ఇతర స్టేట్‌మెంట్లు నేరుగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల నుంచే ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. ఇక కాల్కులేషన్స్ ఈజీగానే ఉన్నట్లు చెప్పారు. పరీక్షలో అడిగిన ప్రశ్నలన్నీ నీట్ సిలబస్ ఆధారంగానే అడగడం జరిగిందని ఎక్కడా వివాదంకు చోటులేకుండా ప్రశ్నలు ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పారు నిపుణులు. మెకానిక్స్‌ టాపిక్‌పై అత్యధికంగా 12 ప్రశ్నలు సంధించగా ఎలక్ట్రిసిటీ టాపిక్‌పై 9 ప్రశ్నలు మరియు మోడ్రన్ ఫిజిక్స్‌పై 8 ప్రశ్నలు అడిగారని చెప్పిన నిపుణులు... మొత్తంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ పై ప్రశ్నలు సులభంగానే ఉన్నాయన్నారు.

కనిపించని వివాదాస్పద ప్రశ్నలు

కనిపించని వివాదాస్పద ప్రశ్నలు


కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ పరంగా చూస్తే... ప్రశ్నలు సులభంగా ఉండే స్టేజ్ నుంచి కఠినంగా మారాయని చెప్పారు. అత్యధికంగా 18 ప్రశ్నలు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే అడిగినట్లు నిపుణులు చెప్పారు. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12 ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. ఇక అడిగిన ప్రశ్నలన్నీ కూడా నీట్ సిలబస్ నుంచే అడిగారని అవికూడా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచే అడిగినట్లు చెప్పారు. ఒకటి కంటే ఎక్కువగా సరైన సమాధానాలు కలిగి ఉన్న వివాదాస్పద ప్రశ్నల జోలికి వెళ్లలేదని చెప్పారు. మొత్తంగా కెమిస్ట్రీ పై అడిగిన ప్రశ్నలు చాలా పెద్దవిగా లేకపోవడంతో విద్యార్థులు ఈ పేపర్‌ను కంప్లీట్ చేసేందుకు 40 నుంచి 45 నిమిషాల సమయం తీసుకుని ఉంటారని చెప్పారు. చాలా తక్కువగా కాల్కులేషన్స్ ఉండటంతో సగటు విద్యార్థి ఎంతలేదన్నా 40 ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పి ఉంటాడని నిపుణులు చెప్పారు.మిగతా అభ్యర్థులు 44 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కష్టంగా బాటనీ పేపర్

కష్టంగా బాటనీ పేపర్

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీట్‌లో బాటనీ పేపర్ కష్టంగా ఉందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. 25 ప్రశ్నలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి అడుగగా.. 18 ప్రశ్నలు ఇంటర్ రెండో సంవత్సరం నుంచి సంధించడం జరిగింని నిపుణులు చెప్పారు. ఇందులో రెండు వివాదాస్పదమైన ప్రశ్నలున్నాయని వీటికి రెండు సమాధానాలు ఉన్నాయని చెప్పారు. మెజార్టీ ప్రశ్నలు ఎన్‌సీఈ‌ఆర్‌టీ పాఠ్య పుస్తకాల నుంచే అడిగినప్పటికీ... రెండు ప్రశ్నలు మాత్రం ఎన్‌సీఈఆర్‌టీకి అనుగుణంగా లేవని నిపుణులు గుర్తించారు. ఇక అడిగిన ప్రశ్నలు అప్లికేషన్ బేస్డ్‌గా ఉన్నట్లు చెప్పారు. కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలు కూడా అడిగారని చెప్పారు. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి అత్యధికంగా 9 ప్రశ్నలు అడుగగా ఎకాలజీ మరియు జెనెటిక్స్ నుంచి చెరో 7 ప్రశ్నలు అడిగారని చెప్పారు.

Recommended Video

#SURIYAagainstNEET:న్యాయూమూర్తులపై హీరో సూర్య కామెంట్స్.. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ!
అభ్యర్థులు చాలా ఆలోచించేలా ప్రశ్నలున్నాయి

అభ్యర్థులు చాలా ఆలోచించేలా ప్రశ్నలున్నాయి

జువాలజీ సబ్జెక్టు విషయానికొస్తే.. కొన్ని మినహాయింపులతో కూడిన ప్రశ్నలు అభ్యర్థులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చెప్పారు. అంటే ప్రశ్నలు కాస్త కష్టంగా అనిపించాయని వెల్లడించారు. కొన్ని ప్రశ్నలు చాలా ట్రిక్కీగా కూడా ఉన్నాయని చెప్పిన ఎక్స్‌పెర్ట్స్ ... కొన్ని ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పరిధిని మించి ఉన్నాయన్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అభ్యర్థి ఎంతో ఆలోచించాల్సి ఉందని చెప్పారు. హ్యూమన్ ఫిజియాలజీ నుంచి అత్యధికంగా 12 ప్రశ్నలు అడుగగా... యానిమల్ హజ్బెండరీ మరియు బయోటెక్నాలజీ నుంచి చెరో 10 ప్రశ్నలు, బయోమోలెక్యూల్స్ నుంచి ఆరు ప్రశ్నలు అడగడం జరిగిందన్నారు. మొత్తంగా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే విద్యార్థి పూర్తి స్థాయిలో ఆలోచించి, మెలుకువలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

English summary
NEET exam conducted successfully on September 13, 2020. NEET 2020 Answer Key would release soon. Appeared candidates can check out the detailed subject-wise analysis and other details shared by an expert here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X